సాధారణంగా మనం ఎవరైనా తప్పు చేసారు అంటే వాళ్ళ వైపు వేలెత్తి చూపిస్తూ ఉంటాము. అలా కాదు ఇలా చేయాలని ఏదో ఒకటి చెబుతూ వుంటారు. కానీ నిజానికి చాలా మంది వారి తప్పులని వాళ్ళు చూసుకోకుండా తెలుసుకోకుండా ఇతరులను వేలెత్తి చూపుతుంటారు. అయితే నిజానికి ఏం చేయాలంటే వాళ్లని వేలెత్తి చూపించడం కంటే ఒకరి కోసం ఒకరు తెలుసుకుంటూ ఉండాలి.
మన యొక్క సామర్థ్యాన్ని గుర్తించగలగాలి. అలానే మనం ఎందులో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాము అనేది కూడా తెలుసుకోవాలి, ఒక గోల్ ని పెట్టుకుని దాని కోసం శ్రమించాలి నిజంగా ఇటువంటివన్నీ కూడా మొదట మనం చూస్తే కచ్చితంగా సక్సెస్ అవడానికి అవుతుంది.
చాలా మందికి వాళ్ల జీవితం కంటే ఎదుటి వాళ్ళ జీవితం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దాంతో పదే పదే ఇతరులని నిందించడం.. ఇతరులకు సలహాలు ఇవ్వడం లాంటివి చేస్తారు. కానీ అలా కాకుండా వాళ్ళ పని మీద వాళ్ళు ఏకాగ్రత పెట్టాలి. వాళ్ళ యొక్క శక్తిని తెలుసుకుని అనుసరిస్తే దానిని సాధించడానికి ప్రయత్నం చేయాలి.
అంతే కానీ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇలా కనుక ప్రతి ఒక్కరు ఆచరిస్తే అనుకున్నది సాధించడానికి అవుతుంది. బలం బలహీనత గురించి తెలుసుకుని అనుకుంటే దానిని సాధించడానికి కష్టపడాలి దీంతో అనుకున్నది సాధించడానికి అవుతుంది గెలవడానికి అవుతుంది చక్కగా బంగారు భవిష్యత్తుని పొందొచ్చు.