ప్రతీ అమ్మా ఓ డాక్టర్, ఎంబీబీఎస్ చదవకుండానే…!

అమ్మ’ పిల్లలకు ఎం కావాలో తనకి తెలిసినంత అందంగా ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే అమ్మ ఎంత విలువైన వ్యక్తి మన జీవితంలో అనేది అర్ధమవుతుంది. సాధారణంగా అమ్మలకు తన పిల్లలే ప్రపంచం. భర్త ఉన్నా సరే పిల్లలకు తాను ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తన పిల్లల కోసం అవసరమైతే జీవితాన్ని కూడా త్యాగం చేస్తుంది ఏ తల్లి అయినా సరే.

సరే ఇక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ అమ్మ దృష్టి వారిపై ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ…? అవును పిల్లలకు ఏది కావాలో ఆ తల్లికి తెలుసు. పిల్లలకు జ్వరం వచ్చినా, కడుపులో నొప్పి వచ్చినా, తల నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా సరే ముందు అమ్మకు తెలుస్తుంది. అమ్మకు ఏ వైద్య శాస్త్రంతో పని లేదు. తాను ఏ వైద్య విద్య చదవాల్సిన పని లేదు.

కాని తన పిల్లలకు ఎప్పుడు ఏ మందు ఇవ్వాలి…? ఏ నొప్పికి ఎం చెయ్యాలి…? ఎలాంటి చికిత్స అవసరం…? అనేది తనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. అందుకే ఎంబీబీఎస్ చదవకుండానే అమ్మ డాక్టర్ అయింది. అమ్మకు తెలిసిన వైద్యం ఎవరికి తెలుసు చెప్పండి. తనకు తెలియకపోతే ఎం చెయ్యాలో కూడా తల్లికి తెలుసు. అందుకే అంటారు పిల్లలు అమ్మ దగ్గర ఎప్పుడూ క్షేమమే.