మీ భాగస్వామితో ఈ విషయాలు ఎప్పటికీ చర్చించకండి.. చెప్పారంటే మీ పని అంతే

-

ప్రేమించిన వాళ్ల దగ్గర ఏదీ దాచకూడదు అంటారు. దాపరికాలు ఎక్కువ అయితే కాపురంలో కలహాలు పెరిగిపోతాయి. కానీ మీ భాగస్వామికి కొన్ని విషయాలను ఎప్పటికీ చెప్పకూడదు. అలా చెప్తే మీ బంధానికే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇంతకీ భాగస్వామితో చర్చింకూడని ఆ విషయాలు ఏంటో చూద్దామా..!

ఎదుటివారి కుటుంబంపై చెడుగా మాట్లాడకండి :

ఎదుటి వారి కుటుంబంలోని వ్యక్తులపై మీకెలాంటి నెగెటివ్‌ భావాలు ఉన్నా వాటిని భాగస్వామితో పంచుకోకపోవడమే మేలు. బదులుగా మీరే అలాంటి ఆలోచనల్ని మనసు నుంచి వదిలించుకునే ప్రయత్నం చేయండి. గతంలో మీకు ఉన్న రిలేషన్‌షిప్స్‌ గురించి ఇప్పుడు భాగస్వామితో ఎప్పుడూ చర్చించకండి. అందువల్ల అవతలి వారికి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌ పెరిగిపోతుంది. మిమ్మల్ని అనుమానించే పరిస్థితి వస్తుంది.

ఇతరుల వ్యక్తిగత విషయాలను చెప్పకండి :

మీ స్నేహితులు మిమ్మల్ని నమ్మి వారి వ్యక్తిగత విషయాలు కొన్నింటిని మీతో పంచుకుంటూ ఉంటారు. అలాంటివి అన్నీ తీసుకెళ్లి మీ భాగస్వామి దగ్గర చెప్పకండి. మీ స్నేహితుల ప్రైవసీకి మీరు భంగం కలిగించిన వారవుతారు. అలాగే ఆఫీసుల్లో వచ్చే గాసిప్స్‌ అన్నింటినీ తెచ్చి వీరికి చెప్పకండి. అందువల్ల మీ మీద అనుమానాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోండి.

పాస్‌వర్డ్‌లను చెప్పకండి :

భర్తే కదా, భార్యే కదా అని ఫోన్‌లో ఈమెయిల్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్లు, బ్యాంక్‌ ఎకౌంట్లలాంటి వ్యక్తిగత పాస్‌వర్డ్‌లను వారితో పంచుకోకండి. సంబంధాలు బాగానే ఉన్నంత వరకు వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులూ రాకపోవచ్చు. కాని, ఏదైనా తేడా వస్తే వీటి వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

కొన్ని ఆర్థిక విషయాలు మాట్లాడకండి :

ఆర్థిక విషయాలను భాగస్వామితో పంచుకోవడం అనేది మంచి విషయమే. అయితే సెన్సిటివ్‌గా ఉన్న కొన్ని ఆర్థిక సంబంధమైన విషయాలను మాత్రం చెప్పకుండా ఉండటమే మంచిది. వాటి వల్ల విభేదాలు వస్తాయి, గొడవలు అవుతాయి..అనుమానాలు ఉంటే వాటిని మాత్రం కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుకోవడం అవసరమే.

అసంతృప్తుల్ని వెల్లడించకండి :

భాగస్వామి మీద అయినా కొన్ని విషయాల్లో మనకు అసంతృప్తులు ఉంటాయి. కొన్ని అభద్రతా భావాలు ఉండొచ్చు. వాటిని నేరుగా ఎప్పుడూ ఎదుటి వారికి చెప్పవద్దు. అవసరమైన సందర్భం వచ్చినప్పుడు ‘ఇలా కాదు.. ఇలా చేయి ’ అని చెప్పే ప్రయత్నం చేయండి. అంతేకాని ఎదుటి వారి తప్పును ఎత్తి చూపుతున్నట్లు, గొడవ పడుతున్నట్లు వాటిని ఎప్పుడూ చెప్పకండి. అందువల్ల బంధం బలహీనం అయి ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news