తన రాజకీయ వ్యాపారానికి అడ్డు వస్తే సీఎం జగన్ ఎవరిని అయినా అణచివేస్తాడని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్, నేను చేతులు కలిపాం అని అన్నారు.జెండా’ పేరుతో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….. ఇది జనం కోరుకున్న పొత్తు ‘ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారు. చెల్లెలు షర్మిలపై సైతం అసభ్యకర పోస్టులు పెట్టించాడు అని ధ్వజమెత్తారు. ఇప్పటంలో పవన్ సభ పెడితే అక్కడి ప్రజల ఇళ్లను కూలగొట్టారు అని అసహనం వ్యక్తం చేశారు . నా నియోజకవర్గం కుప్పానికి వచ్చి నీళ్లు ఇచ్చానని, కుప్పంలో లక్ష మెజార్టీ సాధిస్తా’ అని చంద్రబాబు చెప్పారు.
సినీ ప్రముఖుల్ని సైతం ఈ ప్రభుత్వం శాసించే స్థాయికి వెళ్లిందని, సినీ టికెట్ల పేరుతో రాజమౌళి, చిరంజీవిని అవమానించే స్టేజి కి వెళ్లారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ సంఘటనతో ‘నేను చాలా బాధపడ్డా. జీవితంలో ఇలాంటివి జరగకూడదు అనుకున్నా కానీ అవి జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి అని అన్నారు. వై నాట్ 175 కాదు.. వై నాట్ DSC, జాబ్ క్యాలెండర్. సమాధానం చెప్పు జగన్ అని ప్రశ్నించారు.