భార్య భర్తల మధ్య వ్యతిరేక లక్షణాల ప్రేమ – నిలుస్తుందా?

-

భార్యాభర్తల మధ్య వ్యతిరేక లక్షణాలు ఉన్నప్పుడు ఆ ప్రేమ బంధం ఎలా ముందుకు వెళ్తుంది. వ్యతిరేక లక్షణాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి అని మనం వింటుంటాం. ఒకరు ఏదైనా చేయడానికి ముందుకు వస్తే,  మరొకరు మనకెందుకులేని సైలెంట్ గా ఉంటారు. ఒకరి మనసులో అన్ని పెట్టుకుంటారు మరొకరు బయటకి ఏది అనిపిస్తే అది మాట్లాడతారు.ఇలాంటి లక్షణాలు భార్య భర్తలు కు ఉంటే,మరి ఇలాంటి వ్యతిరేక లక్షణాలు వాళ్ల ప్రేమను బలపరుస్తాయా లేక సవాళ్లను తెచ్చి పెడతాయా అనేది ఇప్పుడు మనము చూద్దాం..

భార్యాభర్తల మధ్య వ్యతిరేక లక్షణాలు ప్రారంభంలో చాలా బాగుంటాయి. పక్కవారిని ఆకర్షిస్తాయి కూడా ఒకరి లోపాలు, మరొకరి బలాలుగా మారతాయి. భార్యాభర్త ఇద్దరిలో ఒకరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఖర్చు పెట్టుకుంటారు. మరొకరు స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేస్తారు. ఇది మొదట్లో చాలా బాగుంటుంది కానీ జీవితం ముందుకు వెళ్లే కొద్దీ, ఖర్చులు పెరిగి బాధ్యతలు పెరగగానే ఈ విషయంపైనే గొడవలు రావచ్చు. అలాగే జీవితంలో కొన్ని విషయాలు కొంతమంది మనసులోనే దాచుకుంటారు. భాగస్వామి దగ్గర కూడా బయటపడరు, కొంతమంది మనసులో ఏది అనిపిస్తే అది ఎదురుగా ఉన్న వ్యక్తులతో పంచుకుంటారు. ఇది ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని, పెంచుతుంది.

When Spouses Are Opposites – Does Love Survive the Differences?

వ్యతిరేక లక్షణాలు ఎప్పుడూ సానుకూలంగా ఉండవు ఒకరి ఆలోచన విధానం జీవనశైలి మరొకరికి అర్థం కాకపోవచ్చు. ఒకరు ప్రణాళిక బద్ధంగా నేను ఇలానే ఉండాలి అని ముందే అన్ని పనులు చేసుకుంటూ వెళ్తారు. మరొకరు స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడే గొడవలు తలెత్తవచ్చు. ఈ తేడాలు సమయం గడిచే కొద్దీ అసహనానికి దారి తీయవచ్చు. ముఖ్యంగా ఇద్దరూ ఒకరి దృక్పథాన్ని మరొకరు గౌరవించాలి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద వాదనలుగా మారవచ్చు.

వ్యతిరేక లక్షణాలు ప్రేమ నిలబడాలంటే ఇద్దరూ సమానత్వాన్ని కాపాడుకోవాలి. ఒకరి లక్షణాలు మరొకరు గౌరవించాలి ఒకరి అలవాట్లను మరొకరు ఇష్టపడాలి ఇద్దరూ ఒకరిపై ఒకరు  ఎక్కువ కాదనే భావన కలిగి ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య గౌరవించడం, సహనం, సమన్వయం చాలా ముఖ్యం. ఉదాహరణకి ఒకరు బయటికి వెళ్లాలి అనుకుంటే మరొకరు ఇంట్లోనే ఉండాలని మనస్తత్వం కలిగిన వారైతే, ఇద్దరు ఒకరి కోరికలు ఒకరు సమన్వయం చేసుకోవాలి. భాగస్వామి కోసం ఒకరు ఒకరోజు బయటికి వెళ్తే, ఇంకొక రోజు ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఉండడం. ఇలా ఒకరి ఇష్టాలను మరొకరు అర్థం చేసుకుంటే బంధం బలపడుతుంది.

ఇద్దరిలో వ్యతిరేక లక్షణాలు కలిగిన ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు. అది ఇద్దరికీ పరస్పర అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఒకరు వ్యక్తిత్వాన్ని మార్చడానికి ప్రయత్నించడం కంటే ఒకరినొకరు అర్థం చేసుకొని అంగీకరించుకొని ముందుకు నడవడం ఎంతో ముఖ్యం. పరస్పర గౌరవం సహనం, బాధ్యత, బంధం పై ఆధారపడి ఉంటుంది.ఇద్దరి మధ్య తేడాలను, సమస్యలుగా మారకముందే బలాలుగా మార్చుకోవడం తో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు సంపూర్ణంగా ఉండే బంధాన్ని నిర్మించుకోగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news