టాలీవుడ్ లో ఎంప్లాయిస్ యూనియన్ వేతనాల పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరుకుంది. 30% వేతనాలను పెంచాలని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్లు చేస్తోంది. అటు వీరితో సంబంధం లేకుండా సొంతంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటామంటూ నిర్మాతలు స్పష్టం చేశారు.

ఫెడరేషన్ కోరినట్లుగా వేతనాలు పెంచలేమని నిర్మాతలు చెప్పడంతో ఈరోజు సాయంత్రం మరోసారి ఈ విషయం పైన మెగాస్టార్ చిరంజీవితో సమావేశం కానున్నారు. అనంతరం ఈ విషయం పైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.