మీ వయసు 30చేరుకునే లోపు నేర్చుకోవాల్సిన మనీ పాఠాలు..

-

ప్రపంచం అంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారి దగ్గరే ఎక్కువ మంది వచ్చి వాలతారు. డబ్బులేనివాడే ఏమీ లేనివాడని డిసైడ్ అయిపోతారు. మనుషులకి ఇవ్వ్వని విలువ డబ్బుకి ఇస్తారు. ఆ డబ్బున్నోళ్ళకి ఇస్తారు. అందుకే అందరూ డబ్బు కోసమే పరుగెడతారు. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత గొప్పవాడిగా వారికి వారు చిత్రీకరించకుంటారు. సమాజం కూడా అలానే చూస్తుంది. ఐతే మీకు కావాల్సినంత డబ్బు సంపాదించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సినవి ఉంటాయి. మరీ ముఖ్యంగా చాలా తక్కువ వయసులోనే ఆర్థిక పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

మీ వయసు 30కి చేరువయ్యిందంటే మీరు రిటైర్ అయ్యే వయసు ఇంకా సగమే ఉందని అర్థం చేసుకోవాలి. అందుకే ఎక్కడ పడితే అక్కడ దేనికి పడితే దానికి ఖర్చు చేయకూడదు. అవసరం లేని వాటికి అస్సలు డబ్బులు పెట్టొద్దు.

మీ బడ్జెట్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోండి. వచ్చిన జీతం వచ్చినట్టుగానే ఖర్చు చేయవద్దు. అలా ఖర్చు చేస్తున్నట్టయితే మీకు కావాల్సిన పనిలో మీరు లేనట్టే లెక్క. మీ అవసరాల కంటే ఎక్కువ డబ్బు వచ్చే పనిని ఎంచుకోండి. అప్పుడే మీకోసం ఎంతో కొంత దాయగలుగుతారు.

అప్పులు ఎక్కువగా చేయకుండా చూసుకోండి. ఇంకా చెప్పాలంటే, అసలు అప్పు చేయకుండా ఉండడమే మంచిది. అత్యవసర పరిస్థితుల్లో మీ చేతుల్లో ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోండి.

మీ భవిష్యత్తు ఎంతో దూరంలో కనిపిస్తున్నా కూడా మీకోసం మీ విశ్రాంత జీవితం కోసం కొంత డబ్బుని దాచుకోండి. రేపెలా ఉంటుందో ఎవరికి తెలియదు గనక, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవాలనే ఆలోచనలు చేయకుండా మీ కోసం మీరే సంపాదించుకోండి. దాన్ని ఇప్పుడే మొదలెట్టండి.

Read more RELATED
Recommended to you

Latest news