రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి మూల విరాట్టు వంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. కె.కె.కె.నాయర్ అనే చెప్పాలి. 1949 నాటి ఉద్యమంలో ఈయనది కీలకపాత్ర. ఈయన యూపీ అధికారి. కృష్ణ కుమార్ కరుణాకరన్ నాయర్ పూర్తి పేరు. కేరళ స్వస్థలం. అలెప్పీలో పుట్టి, మద్రాస్, అలీగడ్ వర్సిటీల్లోనూ లండన్లోనూ ఉన్నత విద్య నభ్యసించారు. 1930లో ఇండియన్ సివిల్ సర్వీ సెస్లో చేరారు. ఉత్తరప్రదేశ్లో ఆయన వివిధ పదవుల్లో పని చేశారు. 1949లో ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్నారు.
1949లో గోరఖ్ నాథ్ మఠం సభ్యుల రామచరిత మానస్ పారా యణం సందర్భంగా బాబ్రీ మసీదులోని ప్రధాన గుమ్మటం లోపల హిందూ దేవతల విగ్రహాలు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన నాటి ప్రభుత్వం.. ఈ విగ్రహాలను మసీదులో పెట్టడంలో నాయర్ కీలక సూత్రధారి అని నిర్ధారించింది. సంఘటన జరిగిన క్షణా ల్లోనే నాయర్ అక్కడకు చేరుకున్నారని, విగ్రహాలు పెట్టి, వ్యవహారమంతా పూర్తయ్యాకే పై అధికారులకు ఏం తెలియనట్టు సమా చారం ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. నాటి ప్రధాని నెహ్రూ.. విగ్రహాలను అక్కడి నుంచి తొల గించాలని ఆదేశించారు. నాయర్ ఆ పని చేయకపోగా, ఉద్యోగాన్ని వదిలి నేరుగా హిందూ మహాసభలో చేరారు. ఈ చర్యతో హిందూత్వ వాదుల్లో నాయర్ హీరోగా మారారు.