18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ శనివారం నుండి వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోవచ్చు…!

కరోనా వ్యాక్సిన్ 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు మే ఒకటి నుండి తీసుకోవచ్చు అన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24 శనివారం నుండి కోవిన్ ప్లాట్ ఫాం లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రానున్న 48 గంటల్లో కొవిన్ ప్లాట్ ఫాం లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు అవుతుంది.

భారత దేశం లో రోజు రోజుకీ కరోనా తీవ్రత ఎక్కువై పోతోంది. కరోనని అదుపు చేయలేక పోతున్నాము. భారతదేశం లో సీరం ఇన్స్టిట్యూట్ చేసిన వ్యాక్సిన్ తో పాటు భారత్ బయోటెక్ వాక్సిన్ మరియు రష్యా స్పాటింగ్ కూడా త్వరలో అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.

సీరం ఇన్స్టిట్యూట్ చేసిన వ్యాక్సిన్ స్టేట్స్ లో నాలుగు వందల కి మరియు ప్రైవేట్ హాస్పిటల్ లో 600 కి అమ్మినట్టు చెప్పింది. ప్రభుత్వ సెంటర్ లో మాత్రం దీని ధర 150 రూపాయలు మాత్రమే.