6 గంటల కంటే తక్కువగా నిద్ర పోతున్నారా..? అయితే ఈ ముప్పు తప్పదు..!

తక్కువగా నిద్రపోయే వారు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే.. మీరు కచ్చితంగా నిద్రపోవాలని బ్రిటిషుకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల బ్రిటీషు శాస్త్రవేత్తలు తక్కువగా నిద్రపోయే వారిపై పరిశోధనలు చేశారు. తక్కువగా నిద్రపోయే వారిలో మానసిక రుగ్మతలు ఎక్కువగా తలెత్తుతున్నాయని వారు గుర్తించారు. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఈ పరిణామాలు ఎక్కువగా ఉంటాయని వారు తెలిపారు.

నిద్ర
నిద్ర

50 ఏళ్లు పైబడిన వారిలోనే..
50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వాళ్లు 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే ఆరోగ్యానికే ప్రమాదం. నిద్రలేమితో మతిస్థిమితం ఏర్పడే ప్రమాదముంది. బ్రిటిషు శాస్త్రవేత్తలు 35 ఏళ్లపాటు 8 వేల మంది వ్యక్తులపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనలో వారికి తెలిసిన అంశం ఏంటంటే.. తక్కువ నిద్రపోయే వారిలో మానసిక స్థితితో బాధ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తించారు. బ్రిటిషు శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయని, ఇలా జరగడానికి గల కారణాలు తెలుసుకోవడంలో విఫలమయ్యామన్నారు.

బ్రిటిష్ మెడికల్ జనరల్ మంగళవారం తెలిపిన రిపోర్టు ప్రకారం.. 6 గంటల కంటే తక్కువగా పడుకునే వారిలో డిమెన్షిత్ అనే వ్యాధిని గుర్తించామన్నారు. ఈ వ్యాధి గుర్తు తెలియని వ్యాధిగా పరిగణించారు. ఈ వ్యాధి బారిన పడిన రోగికి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మతిమరుపు, అల్జిమర్, ఎక్కువగా మాట్లాడలేకపోవడం, ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం, తప్పుడు నిర్ణయాలు, మానవ పరివర్తనాలు వంటి అనేక సమస్యలు సంభవిస్తాయి. ఇవి ఎక్కువగా 50 నుంచి 60 ఏళ్లు పైబడిన వారు 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల ఈ సమస్యలు బారిన ఎక్కువగా పడుతుంటారు.

వయసు ఎక్కువున్నా.. తక్కువగా ఉన్నా రోజూ కనీసం 7 గంటల వరకు నిద్రపోవాలని బ్రిటిషు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 50 ఏళ్లకు పైబడివారు మాత్రం 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవద్దని, లేకపోతే.. డిమెన్షిత్ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయన్నారు. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే 30 శాతం ఎక్కువగా అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని, అందుకే టైంకు తినడం.. టైంకు పడుకోవడం అలవాటు చేసుకోవాలని బ్రిటిషు శాస్త్రవేత్తలు తెలిపారు.