అప్పుడే థర్డ్‌వేవ్‌ నుంచి బయటపడగలం: వీకే పాల్‌

థర్డ్‌వేవ్‌ కొవిడ్‌ గురించి అందరూ భయపడుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా కేసులు చాలా తగ్గుముఖం పట్టాయి. వ్యాక్సినేషన్‌ కూడా రికార్డు స్థాయిలో పూర్తయింది. జూన్‌ 21 నాటికి దాదాపు 85 లక్షల మందికి టీకా పూర్తయింది. కొవిడ్‌ నిబంధనలు మనం జాగ్రత్తగా పాటిస్తే థర్డ్‌ వేవ్‌ ముప్పు నుంచి సులభంగా బయట పడవచ్చని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ మంగళవారం తెలిపారు. అంతేకాదు, అందరూ టీకా కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పారు.

‘మనం టీకా తీసుకుని, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే .. «థర్డ్‌ వేవ్‌కు భయపడాల్సిన అవసరం ఏముంది’ అని ఆయన అన్నారు. కొన్ని బయట దేశాల్లో ఇప్పటికీ వారు రెండో దశను కూడా ఎదుర్కోలేరు. ఎందుకంటే వారు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారు. మనం కూడా అలాగే బయటపడవచ్చన్నారు. వ్యాక్సిన్‌ తీసుకుని కరోనా నిబంధనలు పాటిస్తేనే మళ్లీ మన ఎకానమీ బాగుపడుతుందని, స్కూల్స్, బిజినెస్, కార్యాలయాలు తిరిగి ప్రారంభించాలి మొత్తనికి మన సాధారణ జీవనాన్ని కొనసాగించాల్సిన అవసర ముందని తెలిపారు. ఎంత త్వరగా టీకా తీసుకుంటే.. అంత సులభంగా విపత్కర పరిస్థితి నుంచి బయటపడవచ్చని అన్నారు. జన్‌ భాగీదారి అండ్‌ జన్‌ జాగ్రన్‌ వ్యా క్సిన్‌ పై ఉన్న అపోహాలను ఇది తొలగిస్తుందని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఇమ్యూనైజేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. ప్రభుత్వం కూడా ప్రతిరోజు దాదాపు కోటి మందికి టీకా వేసే దిశగా లక్ష్యం చేసుకుందని ఆయన చెప్పారు. దాదాపు 1.25 కోట్ల టీకా డోసుల ఉత్పత్తి చేసే సామర్థ్యం మన దేశానికి ఉందని చెప్పారు.