బ్రేకింగ్ : కరోనాతో కన్నుమూసిన మరో మంత్రి

-

కరోనా సోకి ఉత్తర ప్రదేశ్‌ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌ మరణించారు. గత నెలలో చేతన్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను లక్నోలోని సంజయ్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. నిన్న ఆయన ఆరోగ్యం క్షీణించగా ఆయనని నిన్నటి నుండి వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు ఉండడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్టు చెబుతున్నారు.

టీమిండియా తరఫున పలు టెస్ట్‌లు, వన్డేల్లో క్రికెట్ ఆడిన చేతన్ చౌహాన్‌.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు. అర్జున అవార్డు కూడా అందుకున్న చేతన్ చౌహాన్.. మహారాష్ట్ర, ఢిల్లీ తరఫున రంజీల్లో ఆడాడు. భారత్ జట్టులోకి 1969లో ఎంట్రీ ఇచ్చిన ఆయన 1969-1978 మధ్య కాలంలో ఆయన 40 టెస్టులు ఆడి 31.57 సగటుతో 2084 పరుగులు చేశారు. 97 పరుగుల అత్యధిక స్కోరు కలిగి ఉన్నారు. ఏడు వన్డేలు ఆడిన చౌహాన్ ‌153 పరుగులు చేశారు. ఇక ఇప్పటికే యూపీలో ఒక మహిళా మంత్రి కూడా కరోనా కారణంగా కన్నుమూశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version