భారత్ లో 3 వేలకు దిగువగా కరోనా కేసులు

-

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చాలా రోజుల తర్వాత కొత్త కేసులు 3 వేలకు దిగొచ్చాయి. ఇక  క్రియాశీల కేసుల కొండ క్రమంగా కరుగుతూ 36 వేలకు తగ్గింది. 24 గంటల్లో 1,34,849 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ వైరస్ సోకి దేశంలో ఇప్పటి వరకు 5,28,701 మంది మరణించారు.

ఇప్పటి వరకు భారత్ లో 4.40 కోట్ల రికవరీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 36,126 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 218.77 కోట్ల టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు దేశంలో నెమ్మదిగా తగ్గుతున్నట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో కరోనా కేసుల నమోదు ఎక్కువగా ఉన్నా.. కొవిడ్ నిబంధనలు పాటిస్తుండటం వల్ల వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉందని పేర్కొంది.

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో డబల్ స్పీడ్ తో జరుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది. ఇప్పటికే చాలా మంది డబుల్ డోస్ వ్యాక్సిన్లు వేసుకున్నారని.. ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా తీసుకుంటున్నట్లు పేర్కొంది. కేవలం నిబంధనలు పాటిస్తూనే కాకుండా.. వ్యాక్సిన్ తో వైరస్ కట్టడి చేయొచ్చని అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version