ఇండియాలో కరోనా రికార్డులు బద్దలు…

-

భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. నిన్ననే రికార్డ్ స్థాయిలో 75 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని అనుకుంటే ఈరోజు ఆ సంఖ్యకు మరో రెండు వేల కేసులు ఎక్స్ట్రా వచ్చి పడ్డాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న కొత్తగా 77,266 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఇక నిన్నటి కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 33,87,501కు చేరింది.

corona
corona

నిన్న ఒక్కరోజే 1,057 మంది కరోనాకు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 61,529కి చేరింది. మొత్తం బాధితుల్లో సుమారు 26 లక్షల మంది కోలుకోగా 7 లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీగా చేపట్టడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రస్తుతం 7,42,023 యాక్టివ్ కేసులు ఉండగా 25,83,948 కేసులు నయం అయినవి ఉన్నాయి. ఇక రోజు రోజుకీ కేసులతో పాటు మరణాలు కూడా పెరగడం టెన్షన్ పెడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news