ఫ్యాక్ట్ చెక్: పచ్చి ఉల్లిపాయలతో పాటు ఉప్పు వేసుకుని తింటే కరోనా 15 నిమిషాల్లో మాయం..!

-

కరోనా సెకండ్ వేవ్ అందరిని ఇబ్బందుల్లోకి నెడుతోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా మూడు లక్షల మైలురాయిని దాటింది. దీనితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పైగా కరోనా బారిన పడకుండా ఉండటానికి అనేక రకాల హోం రెమడీస్ ను కూడా పాటిస్తున్నారు.

ఏది ఏమైనా వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటివి చేయాలి. అనవసరంగా బయటకు వెళ్లడం మానుకోవడం మంచిది. ఈ వైరస్ బారిన పడితే ఇంకా ఏమైనా ఉందా..? అయితే ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి సోషల్ మీడియా లో విపరీతమైన పోస్ట్లు వస్తున్నాయి.

తాజాగా పచ్చి ఉల్లిపాయలు ఉప్పుతో తీసుకుంటే 15 నిమిషాల్లో వైరస్ పోతుందని చెప్పడం జరిగింది. దీనిలో నిజమెంత అనేది ఈ రోజు చూద్దాం..!

ఫ్యాక్ట్ చెక్: చాలామంది సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నమ్మి వాటిని అనుసరిస్తూ ఉన్నారు అయితే తాజాగా పచ్చి ఉల్లిపాయల తో పాటు ఉప్పు కలిపి తీసుకుంటే 15 నిమిషాల్లో వైరస్ పోతుందని.. వైరస్ బారినపడిన వెంటనే తొలగిపోతుందని చెప్పడం జరిగింది. అయితే ఇది ఫేక్ అని ఇన్వెస్టిగేషన్ చేసిన డాక్టర్లు చెప్పారు.

మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ వార్త నిజమా కాదా అని విచారించారు. దీనిలో తేలిందేమిటంటే ఈ పోస్ట్ ఫేక్ అని, ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ 15 నిమిషాల్లో మాయం అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ ఆనియన్ అసోసియేషన్ యుఎస్ కూడా ఇది ఫేక్ అని అన్నారు.

ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదని ఒక ఉల్లిపాయ ముక్క టాక్సిక్ జెర్మ్స్ ని తొలగిస్తుందని ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ ని అది తొలగించదు అని చెప్పడం జరిగింది. అయితే మనం ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి కేవలం మనకున్న ఉపాయం ఏమిటంటే..?

జనం ఎక్కువగా ఉన్న చోట్లకు వెళ్లకుండా ఉండటం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు వేసుకోవడం, చేతుల్ని పదేపదే శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ ని ఉపయోగించడం మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news