ఎవరి నోట విన్నా ఒకే మాట కరోనా. ఆమడ దూరంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా కరోనా భయంతో హడలెత్తి పోతున్నారు జనం. నిన్న మొన్నటి వరకు చైనా నీ వణికించిన కరోనా నేడు ప్రపంచం అంతా వ్యాపించింది. దాదాపు 80 దేశాల్లో ఈ వైరస్ తో ప్రజలు బాధ పడుతున్నారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ భారతదేశాన్ని వణికిస్తోంది. దేశం మొత్తం మీద 31 కరోనా కేసులు నమోదయ్యాయి.
వాటిలో ముగ్గురు కరోనా బాధితులకు స్వస్థత లభించింది. దాదాపు ఇండియా లోని అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రజలు కరోనా భయంతో మాస్కులు లేకుండా బయటకు వెళ్ళడం లేదు. చాలా కార్పొరేట్ ఆఫీస్ లు ఉద్యోగులకు ఇంటి వద్ద నుండి పని చేసే సదుపాయాన్ని కల్పించాయి. ఇంకా స్కూల్స్, కాలేజెస్ కూడా అప్రమత్తం అయ్యారు. ఏ చిన్న అనుమానం కలిగిన టెస్టుల కోసం వైద్యులను సంప్రదిస్తున్నారు.
అయితే ఈ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కేంద్రం ఎంత అప్రమత్తంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వైరస్ మాత్ర౦ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. అన్ని టెలివిజన్ లలోనూ, సోషల్ మీడియా లో ఈ కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.