సంచలనం; ప్రైవేట్ ఆస్పత్రులను జాతీయం చేసిన ప్రభుత్వం…!

-

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయపెడుతుంది. వాతావరణం చల్లగా ఉన్న నేపధ్యంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఈ వైరస్ తీవ్రతను ఏ మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. చైనా, ఫ్రాన్స్, ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికా ఇలా అన్ని దేశాలు కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అన్ని విధాలుగా వైరస్ ని కట్టడి చేస్తున్నాయి.

స్పెయిన్‌లో సోమవారానికి 9,191 మందికి కరోనా సోకింది. 309 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రతకు 8 వేల మంది ప్రాణాలు కోల్పోగా రెండు లక్షల మదికి ఈ వ్యాధి సోకింది. ఈ తరుణంలో వైరస్ ని కట్టడి చేయడానికి గాను స్పెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ప్రైవేట్ ఆస్పత్రులన్నింటినీ జాతీయం చేసేసింది. ఇప్పుడు స్పెయిన్‌లో ఉన్న ప్రతీ ఆస్పత్రీ కూడా ప్రభుత్వ ఆస్పత్రే.

అక్కడ వాతావరణం చల్లగా ఉండటంతో వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దీనితో ప్రజలు కూడా ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. చైనాలో వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అమెరికా సహా అనేక దేశాల్లో ఈ వైరస్ విశ్వ రూపం చూపిస్తుంది. మన భారత్ లో కూడా దాదాపు 150 మంది వరకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. దీనితో అన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version