ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత దేశం రెండో స్థానంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చ్ 22 నుండి 31 వరకు ఏ ఒక్కరు బయటకు రాకూడదని తెలియజేయడం జరిగింది. ఇదేవిధంగా ఇటలీ దేశంలో వైరస్…స్ప్రెడ్ అయిన సందర్భంలో ఆ దేశం ఇచ్చిన హెచ్చరికలను ఆ దేశ ప్రజలు బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించడంతో…ప్రస్తుతం ఇటలీ దేశమంతా కరోనా వైరస్ వ్యాధి వల్ల చనిపోయిన శవాలతో కుప్పలుతెప్పలుగా మారింది.ఆ శవాలను స్మశానంలో పూడ్చడానికి కూడా దేశంలో స్థలం లేదని ఆ దేశానికి చెందిన ప్రెసిడెంట్ బోరున మీడియా ముందు ఏడవటం జరిగింది. ప్రస్తుతం ఇండియాలో జనాలు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో…చాలా వరకు డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోయినట్లు…ప్రస్తుత దశ దాటితే భయంకరంగా, కరోనా వైరస్ మరణాలు ప్రతి వీధిలో చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. జనాభా కలిగిన దేశం కాబట్టి ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు కూడా సరిపోవు..దీంతో మరణాలు భయంకరంగా చోటుచేసుకుంటాయని అంటున్నారు చాలామంది.
అందుకే సాధ్యమైనంత వరకు జన సమూహానికి దూరంగా ఉండాలి. జనంలోకి తప్పనిసరై వెళ్లాల్సి వస్తే.. ముక్కుకు మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చేయాలి. స్వీయ నియంత్రణే చాలా ముఖ్యమన్న సంగతి గుర్తుంచుకోవాలి. ముందే మేల్కొని ఎవరికి వారు స్వీయ నియంత్రణ చర్యలు చేపడితే..వైరస్ భారీ నుంచి సులభంగా బయటపడొచ్చంటున్నారు నిపుణులు.