భారత్ లో కరోనా కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 74,383 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో 918 మంది వైరస్ కారణంగా చనిపోయారని తెలిపింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అలానే ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం కేసుల సంఖ్య 70,53,807గాఉంది. ఇక గడచిన 24 గంటల్లో నమోదయిన మరణాలతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,08,334కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 8,67,496గా ఉంది.
60 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య 10,78,544గా ఉండగా ఇప్పటి దాకా 8,68,77,242 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,753గా ఉంది. దేశంలో 85.81 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 12.65 శాతంగా ఉన్నాయి. అలానే దేశంలో 1.54 శాతానికి మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు ఉంది.