మ‌ద్యం షాపులు తెర‌వండి.. డిప్రెష‌న్‌లో ఉన్న ప్ర‌జ‌లు రిలాక్స్ అవుతారు..!

-

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ దేశ‌వ్యాప్తంగా 21 రోజుల వ‌ర‌కు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్చి 31వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అని ముందుగా ప్ర‌క‌టించారు. కానీ త‌రువాత దాన్ని ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా మ‌ద్యం షాపుల‌ను కూడా మూసేశారు. కానీ మ‌ద్యం షాపుల‌ను తెర‌వాల‌ని.. డిప్రెష‌న్‌లో ఉన్న ప్ర‌జ‌లు మ‌ద్యం తాగి రిలాక్స్ అవుతార‌ని.. ఆ ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు చెబుతున్నారు.. ఇంత‌కీ అస‌లు ఆయ‌న ఏమ‌న్నారంటే…

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రిషీ క‌పూర్ మొన్నా మ‌ధ్య లిక్క‌ర్ షాపుల‌పై చేసిన ట్వీట్‌కు గాను ఆయ‌న్ను కొంద‌రు ట్రోల్ చేసిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ నేప‌థ్యంలో పెద్ద ఎత్తున ఆల్క‌హాల్ స్టాక్ పెట్టుకున్నారా.. అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఆయ‌న్ను విమ‌ర్శించారు. అయితే ఆయ‌న ఇప్పుడు మ‌ళ్లీ చేసిన ట్వీట్లు నెటిజ‌న్ల ట్రోల్స్‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో మ‌ద్యం షాపుల‌ను మూసివేశార‌ని.. కానీ వాటిని ఓపెన్ చేయాల‌ని రిషీ క‌పూర్ అన్నారు. ప్ర‌జ‌లు క‌రోనా నేప‌థ్యంలో డిప్రెష‌న్‌, భ‌య‌భ్రాంతుల‌కు లోన‌వుతున్నార‌ని.. క‌నుక మ‌ద్యం తాగితే వారికి కొంత భ‌యం త‌గ్గి ప్ర‌శాంతంగా ఉంటార‌ని.. అలాగే డాక్ట‌ర్లు, పోలీసులు, ఇత‌ర అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందిస్తున్న సిబ్బంది మ‌ద్యం తాగి రిలాక్స్ అవుతార‌ని.. ఆయ‌న అన్నారు. ఇక మ‌ద్యం షాపుల‌ను మూసివేయ‌డం వల్ల ప్ర‌భుత్వాల‌కు పెద్ద ఎత్తున ఆదాయం త‌గ్గుతుంద‌ని, క‌నుక ప్ర‌జ‌ల కోసం డ‌బ్బును ఖ‌ర్చు పెట్టాలంటే.. ఆదాయం రావాల‌ని.. అందుకు గాను మ‌ద్యం షాపుల‌ను తెర‌వాల‌ని.. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్టులు పెట్టారు. ఇక దీనిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. మ‌రి ఈ విష‌యం ప‌ట్ల ప్ర‌భుత్వాలు ఏం చేస్తాయో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version