లాక్ డౌన్ వల్ల రోజు రోజుకి పేదలు ఇబ్బందుల పాలవుతున్నారు. పని చేస్తే తప్ప రోజు గడవని పేదలు ఆహారం కోసం అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా లాక్ డౌన్ చివరి దశకు చేరుకోవడంతో కేంద్రం కూడా ఎత్తివేసేందుకు మొగ్గు చూపడంతో పేదలు పని చేయడం కోసం రెడీ కాబోతున్నారు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన గతంలో లాగా బతికే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉండవని మేధావులు అంటున్నారు.
కొద్ది రోజుల క్రితమే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కు, గ్రీన్ జోన్లలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. మే మూడు తర్వాత ఒక వేళ స్వేచ్ఛ లభించిన ప్రస్తుత పరిస్థితులు బట్టి ఆ రోజులు రావడం కష్టమే అని చాలామంది అంటున్నారు. ఇక నుండి ప్రభుత్వాలు విధించే ఆంక్షల కి ప్రజలు అలవాటు పడాల్సిందే తప్పదు అని నిపుణులు అంటున్నారు.