షాకింగ్ : ఆగ్రా స్వీటు అంతపని చేసిందా?

-

ప్రపంచం మొత్తం చైనా వల్ల కరోనా వచ్చిందని మొత్తుకుంటుంటే… ఇండియాలో మాత్రం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ వాదనకు తబ్లిగీ జమాతే మీటింగ్ కూడా యాడ్ అయ్యింది! ఈవేదికగా ఢిల్లీ  జరిగిన మీటింగ్ అనేది లేకపోతే… ఈపాటికి కరోనా రహిత దేశంగా భారత్ ఉండేది అన్నా అతిశయోక్తి కాదేమో! ఆ రేంజ్ లో తబ్లిగీ జమాతే సంస్థ ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రార్థనల వల్ల జరిగిన కరోనా టెన్షన్ ఇంకా భయాందోలనలకు గురిచేస్తూ.. రోజుకో కొత్తరకం టెన్షన్స్ పుట్టిస్తుంది! ఈ విషయంలో తాజాగా స్థానం సంపాదించుకున్నాయి ఆగ్రా స్వీట్స్!

అవును… కరోనా వ్యాప్తికి ఆగ్రా స్వీట్స్ కూడా కారణమయ్యాయేమో అంటూ కంగారు పడుతున్నారు అధికారులు. మర్కజ్ తో పాటు దేవ్ బంద్ దర్గాతో పాటు ఇతర దర్గాలకు వెళ్లిన వారు తమ తిరుగు ప్రయాణంలో ఆగ్రాలోనూ పర్యటించారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయంటున్నారు అధికారులు! వీరంతా తిరుగు ప్రయాణంలో ఆగ్రాలో స్వీట్లు కొనుగోలు చేసి, ఇంటికి వచ్చాక స్నేహితులకు, బందువులకు పంచి పెట్టారనే విషయం కలకలం రేపుతుందనే అనుకోవాలి. ఇదే క్రమంలో వీరు ప్రయాణ సమయంలో రైళ్లలోని తోటి ప్రయాణికులకు కూడా పంచి ఉంటారా అనే ఆందోళన కూడా పోలీసులు వ్యక్తపరుస్తున్నారు!

నిర్మళ్ లోని తహసిల్ధార్ కార్యలయంలో ఆగ్రా వెళ్లి వచ్చిన ఒక వీఆర్ఓ ఈ స్వీట్లు పంచారట! దీంతో అప్రమత్తమైన అధికారులు తహసిల్ధార్ కార్యాలయాన్ని మూసివేయడంతోపాటు ఆ కార్యాలయ సిబ్బందిని క్వారంటైన్ కు పంపించారట. అయితే మర్కజ్ వెళ్లివచ్చిన వారు ఇంకా అనేకమందికి పంచడం వల్ల అవి తిన్నవారంతా ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు! ఈ సంఘటన జరిగి చాలా రోజులే అయ్యింది కదా అనుకున్నా… ఈ స్వీట్లు చాలా రుచిగా ఉండటం.. దాంతోపాటు అవి సుమారు రెండు నుంచి మూడు వారాలపాటు నిల్వ ఉండే సామర్ధ్యం కూడా కలిగి ఉండటంతో… లేటెస్టుగా ఎవరైనా వాటిని దాచుకుని మరీ తిన్నారా అనే ఆందోళన నెలకొందని అంటున్నారట!! ఈ స్వీట్లు తిన్నవారి సంగతి ఏమో కానీ… ఈ వార్తలు విన్నవారు మాత్రం… సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్స్ చేస్తునారా?

Read more RELATED
Recommended to you

Latest news