కొత్త టెన్షన్ : కరోనా వచ్చి తగ్గినా ప్రాణ గండం ?

-

కరోనా వైరస్ చికిత్స పొందిన కొద్దిరోజులకే నెగటివ్ వస్తే అంత తగ్గిపోయిందని రోడ్లమీద తిరిగేస్తున్నారా ? అయితే జాగ్రత్త. మీకు కరోనా వచ్చి తగ్గాక అలసటగా ఉంటోందా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా ? అయితే మీకు పోస్ట్ కరోనా సమస్యలు మొదలైనట్టె అని అంటున్నారు డాక్టర్లు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. అందుకే గాంధీ ఆస్పత్రిలో త్వరలో పోస్ట్ కరోనా వార్డ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. కరోనా నుండి కోలుకున్న సంతోషం చాలా మందికి మిగలడం లేదు. ఎందుకంటే వెంటనే ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

కరోనా వారియర్ నని అభినందనలు అందుకున్న కొద్దిరోజుల్లోనే కొత్తకొత్త సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. కరోనా వచ్చిన వారంలోనే నెగటివ్ వచ్చిందని చాలా మంది చెబుతుంటారు అలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే. అలాంటి వారికీ దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే నెగిటివ్ వచ్చిన కొందరు ఒళ్ళు నొప్పులు అలాగే ఉంటుంది కొందరికి. ఎంత మంచి పౌష్టికాహారం తీసుకున్నా నీరసంగా అలసటగా ఉంటుంది అని అంటున్నారు. అందుకే పాజిటివ్ వచ్చి చికిత్స తర్వాత నెగిటివ్ వచ్చినా అసలు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు వైద్యులు. ఎందుకంటే కనిపించకుండానే వారి శరీరంలోని అవయవాలన్నీ కరోనా నాశనం చేస్తోందని అంటున్నారు. కరోనా వచ్చ తగ్గిన అందరికీ చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చినట్లు చెబుతున్నారు. సో బీ కేర్ ఫుల్

Read more RELATED
Recommended to you

Exit mobile version