బ్రేకింగ్ : ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వానికి 50 శాతం బెడ్స్

-

కరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్రైవేటు ఆసుపత్రులు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఒకరకంగా ప్రైవేటు ఆసుపత్రులని ఈ కరోనా ఎపిసోడ్ లో విలన్ గా కనపడుతున్నాయి. ఇప్పటికే చాలా ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేసి లైసెన్స్ లు కూడా రద్దు చేయించుకున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలలో భాగంగా ప్రైవేటు ఆసుపత్రులు దిగి వచ్చాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో భేటీ అయిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు.. ప్రతి ఆస్పత్రిలో 50 శాతం బెడ్ ను ప్రభుత్వానికి అందించడానికి అంగీకరించారు. సంక్షోభ సమయంలో వ్యాపారం చేయవద్దని పలు మార్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులను కోరిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ 50 శాతం బెడ్ ల విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే వైద్య సేవలు అందించబోతున్నారు. ఈ బెడ్స్ ను వైద్య ఆరోగ్య శాఖ ఒక యాప్ ద్వారా అందుబాటులోకి తేనున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news