ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ వస్తున్న సమీరా రెడ్డి, తన జీవితంలో జరిగిన విషయాలని, ముఖ్యంగా బరువు తగ్గడం గురించి చెబుతూ వస్తుంది. ఇటీవలే తన కుటుంబం మొత్తం కోవిడ్ బారిన పడింది. అందరూ ఐసోలేషన్ లోకి వెళ్ళి అన్ని జాగ్రత్తలు తీసుకుని కరోనా నుండి బయటపడ్డారు. ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్నాక వచ్చే బలహీనతను జయించడానికి కొన్ని చిట్కాలను చెప్పింది. అవేంటో చూద్దాం.
కోవిడ్ తర్వాత చాలా మందిలో అనేక బలహీనతలు కలుగుతున్నాయి. అలాంటి బలహీనతలని ఎలా దూరం చేసుకోవచ్చో సమీరా రెడ్డి చెప్పిన సలహాలు.
కొబ్బరి నీళ్ళూ తాగాలి. ఉసిరి, నిమ్మ జ్యూస్ తాగాలి. ఖర్జూరం, కాలా జామూన్ తో పాటు రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్ష, బాదం తీసుకోవాలి. ఇంకా తాజా పండ్లని ఆహారంగా తినాలి. మీ ఆహారానికి బెల్లం, నెయ్యిని కలుపుకోవాలి. పప్పులు, కిచిడి, కూరగాయలు తినాలి. ప్రాసెస్ చేసినా ఆహారాలు, రిఫైన్ చేసిన వాటిని అస్సలు ముట్టుకోవద్దు. ఫోన్, టీవీ చూడడం బాగా తగ్గించాలి. కావాల్సినంతగా నిద్రపోవాలి. రోజూ పొద్దున్న లేచి కనీసం 15నిమిషాల పాటైనా ఎండలో నిల్చోవాలి.
మరీ తీవ్రంగా వ్యాయామాలు చేయవద్దు. మెల్లగా నడవడం వరకు ఓకే. ప్రాణాయామం వంటి శ్వాసకి సంబంధించిన యోగాసనాలు చేస్తే బాగుంటుంది. మీ మనసులో ఉన్న ఆలోచనలని అవతలి వారితో పంచుకుంటే బాగుంటుంది. గుండె బరువు దించుకుంటేనే బెటర్. ఇవన్నీ తనకి సాయం చేసాయని తెలిపింది. ఇంకా కావాలనుకుంటే మీ వైద్యుడిని సంప్రదించండని చెప్పింది. కరోనా తర్వాత బలహీనతతో బాధపడేవారి ఇవి బాగా పనిచేస్తాయి.