బిగ్‌బ్రేకింగ్‌: సింగ‌పూర్‌లో జూన్ 1 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు‌..

-

సింగ‌పూర్ ప్ర‌ధాని లీ సైన్ లూంగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ దేశంలో క‌రోనా లాక్‌డౌన్‌ను జూన్ 1వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అక్క‌డ కొత్త‌గా 1,111 కరోనా కేసులు న‌మోదు కావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో సింగ‌పూర్‌లో ప్ర‌స్తుతం మొత్తం న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 9,125కు చేరుకుంది.

singapore extended corona lock down till june 1st

సింగ‌పూర్‌లో ఎక్కువ‌గా న‌మోదు అవుతున్న క‌రోనా కేసులు విదేశీయుల‌వే కావ‌డం గ‌మ‌నార్హం. వారంతా అక్క‌డి డార్మిట‌రీల‌లో ప‌నిచేస్తున్న వ‌ర్క‌ర్ల‌ని తేలింది. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్‌ను పొడిగించాల్సి వ‌చ్చింద‌ని సింగ‌పూర్ ప్ర‌ధాని తెలిపారు. ఇక ఆ దేశంలో ఎప్ప‌టిక‌ప్పుడు న‌మోద‌వుతున్న కొత్త క‌రోనా కేసుల సంఖ్య‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

సింగ‌పూర్‌లో మొత్తం 19 ఫారిన్ వ‌ర్క‌ర్ డార్మిట‌రీలు ఉండ‌గా.. వాటిలో కొన్నింటిని ఐసొలేష‌న్ ఏరియాలుగా ఎంపిక చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డ క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అయితే తాము పెద్ద ఎత్తున క‌రోనా టెస్టులు చేస్తున్నందునే కొత్త కేసులు కూడా ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయ‌ని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. కాగా ఆగ్నేయాసియాలో అతి ఎక్కువ క‌రోనా కేసులు న‌మోదైంది సింగ‌పూర్‌లోనే కావ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news