కోవిడ్ 19: వ్యాక్సిన్ ప్రభావాన్ని పెంచే ఈ ఆహారాలు.. అస్సలు మిస్ అవ్వద్దు.

-

18ఏళ్ళు పైబడ్డ వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని జూన్ 21వ తేదీ నుండి అందరికీ వ్యాక్సిన్ వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐతే వ్యాక్సిన్ విషయంలో చాలామంది చాలా సందేహాలు పెట్టుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత తలనొప్పి, చిన్నపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులకి భయపడి వ్యాక్సిన్ ని ఆలస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ప్రభావాన్ని మరింత పెంచి, ఇలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండడానికి నిపుణులువ్యాక్సిన్ సూచించిన సలహాలు మీకోసం.

వ్యాక్సిన్

తృణ ధాన్యాలు

బార్లీ, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి తృణ ధాన్యాలని ఆహారంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలు రోగనిరోధక శక్తిని మరింత పెంచుతాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలైనవి.

శరీర నీటిని పెంచే ఆహారాలు

కావాల్సినన్ని నీళ్ళు, అవసరమైన ఆహారాలు శరీరంలో నీటిశాతాన్ని పెంచుతాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారు వాటిని అస్సలు మిస్ అవ్వద్దు. పుచ్చకాయ, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ మొదలగునవి మంచివి.

పసుపు

వంటింట్లో విరివిగా ఉపయోగించే పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ధర్మాలు ఉన్నాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇందులో ఉండే కర్క్యుమిన్, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నివారణలో బాగా ఉపయోగపడుతుంది.

ఆకు కూరలు

ఆరోగ్యానికి అత్యవసరమైన విటమిన్ ఏ, సిమ్, కే, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం మొదలగునవి రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తాయి. వీటికోసం ఆకు కూరలైన కాలీ ఫ్లవర్, బ్రోకలీ, పాలకూర, క్యాబేజీ, బీన్స్ మొదలగునవి వ్యాక్సినేషన్ తర్వాత చాలా ముఖ్యమైన ఆహారాలు.

అల్లం

అల్లంలో 30రకాల అమైనో ఆమ్లాలు, 500రకాల ఎంజైములు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news