మాన‌వ‌త్వం మంట‌గ‌లిసిన వేళ‌.. అన్నం కోసం చెత్త‌కుప్ప‌లో వెతుకులాట‌!

దేశంలో క‌రోనా మాన‌వ‌త్వాన్ని చంపేస్తోంది. మీరు విన్న‌ది నిజ‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నుషుల‌ను చంపిన ఈ మ‌హ‌మ్మారి ఇప్పుడు మాన‌వ‌త్వాన్ని కూడ పొట్ట‌న బెట్టుకుంటోంది. ఈ క‌ష్ట కాలంలో.. కూలీ చేసుకుని బ‌తికే పేద‌ల గోస‌లు వ‌ర్ణ‌నాతీతం. ప‌నుల్లేక‌.. పూట గ‌డ‌వ‌క చాలామంది ప‌స్తులుంటున్నారు. కొంద‌రైతే ఆక‌లితో ప్రాణాలు కూడా విడుస్తున్నాడు.

ఇక తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలిస్తోంద‌. ఆలూరు స‌మీపంలో నివాసం ఉంటున్న రాజు వ్య‌వ‌సాయ కూలీగా బ‌తుకుతున్నాడు. ఇక ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్ట‌డంతో.. ఏ ప‌నీ లేక ఖాళీగా ఉంటున్నాడు. చేతిలో డ‌బ్బుల్లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నాడు. ఎవ‌రైనా పెడితే తిన‌డం లేదంటే ప‌స్తులుండ‌ట‌మే.

ఇక ఓ రోజైతే.. ఆక‌లి త‌ట్టుకోలేకపోయాడు. ఎవ‌రు సాయం చేయ‌క‌పోవ‌డంతో.. చివ‌రికి చెత్త‌కుప్ప‌లో ఏమైనా తిన‌డానికి దొరుకుతాయోమే అని వెత‌క‌సాగాడు. చివ‌రికి తిన‌గా మిగిలిన భోజ‌నంతో ఉన్న‌కొన్ని క‌వ‌ర్లు క‌నిపించాయి. కానీ అవి అప్ప‌టికే పాడ‌యిపోయాయి. ఇది గ‌మ‌నించిన స‌తీశ్.. రాజును చేర‌దీశాడు. స‌తీశ్కు భోజ‌నాన్ని అందించాడు. రాజుకు నివాసం ఏర్పాటు చేసేందుకు ఓ కాంట్రాక్ట‌ర్ ముందుకొచ్చాడు.