బీజేపీకి వ్యతిరేకంగా రాజాసింగ్ వైఖరి.. స్పందించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాసింగ్ మా ఎమ్మెల్యే.. పార్టీ రాజాసింగ్ తో మాట్లాడుతుందని తెలిపారు. కిసన్ రెడ్డి కూడా మాట్లాడారు అని అనుకుంటా. గౌతమ్ రావు బీజేపీలోకి కొత్త వ్యక్తి కాదు.. రామచందర్ రావు రాజాసింగ్ తో మాట్లాడారు. పార్టీలోని అందరితో మాట్లాడిన తరువాత అభ్యర్థిని ప్రకటించారు.

దాదాపు 30 సంవత్సరాలు ఏబీవీపీలో పని చేశారు. గత 15 సంవత్సరాలుగా బీజేపీలో పని చేశారు. మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరు అధికారంలో ుంటే వారికి వత్తాసు పలికేది ఎంఐఎం అని రామచంద్రారెడ్డి తెలిపారు. ఆ పార్టీ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్  చేతులు ఎత్తేశాయన్నారు. మతోన్మాద మజ్లిస్ కి వ్యతిరేకంగా అందరం ఒక్కటవుదాం అని పిలుపునిచ్చారు. ఎంఐఎం కి వత్తాసు పలుకుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news