బ్రేకింగ్; జెఎన్‌యు ఘటనకు 3 గంటల ముందే పోలీసులకు వాట్సాప్ మెసేజ్…!

-

దేశ రాజధాని ఢిల్లీలో ని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో ఆదివారం హింసాకాండ జరగడానికి 3 గంటల ముందు క్యాంపస్‌లో దుండగులు ఉన్నట్లు జెఎన్‌యు విద్యార్థులు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియా వాట్సాప్ స్క్రీన్ షాట్లను బయటపెట్టింది. అయినా సరే ఢిల్లీ పోలీసులు ఎటు వంటి చర్యలు తీసుకోలేదు. వాట్సాప్ హెచ్చరికల స్క్రీన్ షాట్లను ఇండియా టుడే సేకరించింది.

ఇన్స్పెక్టర్ సంజీవ్ మండల్ & స్పెషల్ పోలీస్ కమిషనర్ ఆనంద్ మోహన్ కు జెఎన్యుఎస్యు ప్రెసిడెంట్ ఈషే ఘోష్ జనవరి 5 మధ్యాహ్నం 3 గంటలకు పంపించారు. సర్, విగ్రహం దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆయుధాలు మరియు కర్రలతో గుమిగూడి ఉన్నారని ఆమె మెసేజ్ చేసారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మెసేజ్ చేసారు. కాని దీని నుంచి ఏ విధమైనా స్పందనా రాలేదు.

JNUSU ప్రెసిడెంట్ పంపిన మెసేజ్ లను ముగ్గురు అధికారులలో ఒకరు మధ్యాహ్నం 3:07 గంటలకు చదివారని స్క్రీన్‌షాట్‌లు చూపిస్తున్నాయి, ఇంకా 7:45 గంటల వరకు అదనపు బలగాలు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించలేదు. జెఎన్‌యు హింస జరిగిన రోజున జరిగిన సంఘటనల వివరాలను వివరించే ఢిల్లీ పోలీసుల నివేదికలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆదివారం మధ్యాహ్నం 4:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు, 50 కి పైగా కాల్స్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లినట్లు తెలిసింది. దుండగులు వర్సిటి లోపల విద్యార్ధులను కొడుతున్నట్టు ఫోన్లు చేసారు. అయినా పోలీసుల నుంచి స్పందన లేదు.

Read more RELATED
Recommended to you

Latest news