ఉసిరి యొక్క 21 నామములు

-

ఉసిరి.. హిందు ధర్మంలో దీనికి ప్రత్యేకస్థానం ఉంది. అందులో కార్తీకంలో దీనికి ఇచ్చే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్తీకంలో ప్రతీది ఉసిరితోనే ముడిపడి ఉంటుంది. దీనివెనుక సైన్స్ దాగి ఉంది. స్నానం, దానం, దీపం, భోజనం ఇలా అన్నింటిలో ఉసిరిని మన పెద్దలు చేర్చారు.

ఉసిరి దీపం ఎలా పెట్టాలి...ఇలా పెడితే 7 జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మి దేవి  అనుగ్రహం,అదృష్టం ... - YouTube | Devotional quotes, Devotional songs,  Caramel applesకార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలని పెద్దలు చెప్తారు. అయితే ఆ సమంయలో ఉసిరికి సంబంధించిన పవిత్రమైన 21 నామాలను చదివితే విశేష ఫలితాలు వస్తాయి, ఆ నామాలు..
ఓం ధాత్రై నమ:
ఓం రామాయై నమ:
ఓం శా0త్యి నమ :
ఓం లోక మాత్రయై నమ:
ఓం కా0త్యి నమ :
ఓం ఆబ్ధి తనయాయై నమ:
ఓం మేధాయై నమ:
ఓం గాయత్రీయై నమ:
ఓం కళ్యానై నమ:
ఓం సావిత్రియై నమ:
ఓం విష్ణు పట్నై నమ:
ఓం విశ్వరూపాయై నమ:
ఓం మహాలక్ష్మిఁ నమ:
ఓం సురూపాయై నమ:
ఓం ప్రకృతె నమ:
ఓం కమనీయాయై నమ:
ఓం ఇందిరాయై నమ:
ఓం అవ్యక్తాయై నమ:
ఓం సుధ్యత్యి నమ:
ఓం కమలాయై నమ:
ఓం జగధ్దాత్రియై నమ:
-ఇలా పైన పేర్కొన్న నామాలను చదివి ఉసిరి దగ్గర దీపం పెట్టాలి. ఉసిరి చెట్టుకొమ్మలను తెచ్చి దీపం పెట్టడం శాస్త్రసమ్మతం కాదు. కానీ ఆపధర్మంగా బజారులో అమ్ముతున్న వాటిని తెచ్చి ప్రస్తుత కాలంలో భక్తులు దీపం పెడుతున్నారు. కనీసం వచ్చే ఏడాదికన్నా మీమీ ఇండ్లలలో ఉసిరి చెట్టు పెంచి అక్కడ దీపాలను పెట్టండి. కనీసం గల్లీకి ఒక చెట్టు పెంచినా ముక్తి, భుక్తి దొరుకుతాయి. ఇది సైన్స్పరంగా అత్యంత ఔషధ గుణాలను కలిగిన మొక్క.
– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news