సోమవతి అమావాస్య ఇలా చేస్తే ఈ జాతకదోషాలు పోతాయి !

కార్తీకమాసంలో చివరి సోమవారం అందునా అమావాస్య కావడం మరీ విశేషం దీన్ని సోమవతి అమావాస్య అంటారు. అయితే ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం.. శివాలయంలో వుండే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీకంలో వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దీంతోపాటు పితృ దేవతలకు ఈ రోజున పిండప్రదానం చేస్తే పెద్దలు సంతృప్తి చెందుతారు. తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.

– శ్రీ