బిగ్ బాస్: ఎలిమినేట్ అయిన మోనాల్.. హారిక ఫైనల్ లో కష్టమేనా..?

-

బిగ్ బాస్ లో చివరి ఎలిమినేషన్ నేడే జరిగింది. పదిహేను వారాల రియాలిటీ షో నుండి చివరి వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. అందరూ అనుకున్నట్టుగానే మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయ్యి, హౌస్ లో ఐదుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. ఒక్కొక్కరుగా ఫైనల్ కి వెళుతూ, చివర్లో ఆరియానా, మోనాల్ ల మధ్య ఎలిమినేషన్ లో సస్పెన్షన్ కొనసాగింది. ఒక్కసారిగా ఆరియానా సేవ్ అవడంతో నోట మాటరాకుండా అయిపోయింది.

మోనాల్ ఎలిమినేట్ అవడంతో అఖిల్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఐతే ఈ ఎలిమినేషన్ ని మరీ ఎమోషనల్ గా సాగకపోవడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రతీ చిన్నదానికి ఎమోషనల్ అయిపోయి, కన్నీరు కార్చే మోనాల్, ఎలిమినేట్ అయినప్పటికీ సంతోషంగానే కనిపించింది. ఇక్కడి వరకు రావడమే తన అదృష్టమని భావించింది. ఐతే స్టేజి మీదకి వచ్చాక అఖిల్ పాట పాడడం ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేసింది.

ఐతే స్టేజి మీద నిలబడి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో మాట్లాడిన మోనాల్, హారిక టాప్ 2లో అఖిల్ తో పాటు ఉండాలని, వీలైతే ట్రోఫీ కూడా గెలవాలని, బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఇంతవరకు ఎవరూ సాధించని టైటిల్ గెలవాలని ,కోరింది. ఐతే మోనాల్ కోరిక నిజమవుతుందా లేదా అనేది వచ్చే వారం వరకూ తెలియదు గానీ, హారికకి గెలిచే అవకాశాలు అంతగా ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. అదీగాక హౌస్ లో ఉన్నప్పుడు చాలా విషయాల్లో హారికకి, మోనాల్ కి పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

వాటిని పరిగణలలోకి తీసుకుంటే, గెలవకుండా బయటకి వచ్చేసిన మోనాల్ లాగే, హారిక కూడా వచ్చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. మరి ఏమవుతుందో

Read more RELATED
Recommended to you

Latest news