మోదీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన కానుక‌ “స్వచ్ఛ భార‌త్ అభియాన్‌” ..!

-

స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ నిజానికి ఎంతో మంది పేద‌ల‌కు మేలు చేసింది. ఆ కార్య‌క్ర‌మం కింద మోదీ ప్ర‌భుత్వం ఎంతో మందికి మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టించి ఇచ్చింది.

మన దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి ఎంతో కాలం అయింది. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ అనేక ప్రాంతాల్లో పారిశుధ్య స‌మ‌స్య తీవ్రంగా ఉంది. ఎక్క‌డ చూసినా చెత్తా చెదారం, రోడ్ల‌పై వ్య‌ర్థాలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ఇక జ‌నాల‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కైతే లెక్కే ఉండ‌డం లేదు. అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో గ‌త ప్ర‌భుత్వాలు.. ముఖ్యంగా యూపీఏ హ‌యాంలోని ప్ర‌భుత్వాలు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయి. కానీ మోదీ మొదటి సారిగా ప్ర‌ధాని అయ్యాక‌.. పైన చెప్పిన స‌మ‌స్య‌ల‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. అందుక‌నే ఆయ‌న స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం కింద దేశంలో అస‌లు పారిశుధ్య స‌మ‌స్య లేకుండా, ప్ర‌జ‌లంద‌రినీ ఆరోగ్యవంతుల‌ను చేయాల‌న్న‌దే ఆయ‌న ఉద్దేశం..!

swachcha bharath abhiyan is a gift to people from pm modi

స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ నిజానికి ఎంతో మంది పేద‌ల‌కు మేలు చేసింది. ఆ కార్య‌క్ర‌మం కింద మోదీ ప్ర‌భుత్వం ఎంతో మందికి మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టించి ఇచ్చింది. అలాగే తిన‌డానికి ముందు చేతుల‌ను స‌బ్బుతో బాగా శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల 80 శాతానికి పైగా వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చ‌న్న నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి మోదీ బాగా తీసుకెళ్లారు. దీంతో జ‌నాల్లో శుభ్ర‌త ప‌ట్ల అవ‌గాహ‌న కూడా పెరిగింది. ముఖ్యంగా ప‌లువురు సెల‌బ్రిటీల‌తో స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో ప్ర‌జ‌లు ఈ కార్య‌క్రమంలో అత్య‌ధిక సంఖ్య‌లో భాగ‌స్వాములు అయ్యారు.

స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఓపెన్ డీఫెకేష‌న్ ఫ్రీ (బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న ర‌హిత‌) ప్రాంతాలుగా మారాయి. ఎంతో మంది పేద‌లు గౌర‌వంతో సొంత మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టించుకుని జీవిస్తున్నారు. ఇక 2014కు ముందు అనేక ప్రాంతాల్లో నివ‌సించే ప్ర‌జ‌ల్లో కేవ‌లం 37 శాతం మంది మాత్ర‌మే మ‌రుగుదొడ్ల‌ను క‌లిగి ఉండ‌గా, స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ కార్య‌క్ర‌మం ప్ర‌వేశ‌పెట్టాక‌.. 2018 వ‌ర‌కు 71 శాతం మంది మ‌రుగుదొడ్ల‌ను నిర్మించుకోగ‌లిగారు. అలాగే దేశ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు స్వ‌చ్ఛ‌త అభియాన్ పేరిట దేశంలో అత్యంత శుభ్రంగా ఉన్న ప్రాంతాల‌ను ఎంపిక చేసి ప్రోత్సాహ‌కాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తోంది.

ప్ర‌ధాని మోదీ ప్ర‌వేశ‌పెట్టిన స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్ కార్య‌క్ర‌మాన్ని నిజానికి ప్ర‌పంచంలోని అనేక దేశాలు అభినందించాయి. స్వ‌చ్ఛ‌త‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గొప్ప కార్య‌క్ర‌మం చేప‌డుతున్నార‌ని ప్ర‌పంచ దేశాల‌కు చెందిన నేత‌లు మోదీకి కితాబిచ్చారు. అందులో భాగంగానే స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. స్వాతంత్య్రం వ‌చ్చిన ఇన్నేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు పారిశుధ్యం, స్వ‌చ్ఛ‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ.. వారు ప‌రిశుభ్ర‌మైన‌, స్వ‌చ్ఛ‌మైన వాతావ‌ర‌ణంలో జీవించేందుకు తోడ్పాటునందిస్తోంది కేవ‌లం మోదీ ప్ర‌భుత్వ‌మే అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు..!

Read more RELATED
Recommended to you

Latest news