సైరా : కళ్ల ముందు కదలాడిన స్వాతంత్ర్య వీరులు..!

-

మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ సైరా నరసింహారెడ్డి విడుదలైంది. అభిమానులు మొదటి షోను ఆస్వాదిస్తున్నారు. చిరంజీవి మూడేళ్ల కష్టం తెరపైకి వచ్చేసింది. దాదాపు 250 నుంచి 300 కోట్లు వరకూ ఈ సినిమా కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్లోనే ఇది అత్యధిక బడ్జెట్. అంతే కాదు.. ఈ సినిమాలో దాదాపు అన్ని ప్రధాన భాషల నటులను తీసుకున్నారు.

టైటిల్ రోల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి పోషించిన సంగతి తెలిసిందే. ఈ రోల్ లో చిరంజీవి పెర్ఫామెన్స్ అద్దిరిపోయిందని తెలుస్తోంది. అలాగే చిరంజీవి గురువు గోసాయి వెంకన్నగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ నటించారు. ఇక ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. నరసింహారెడ్డి బ్రిటీష్ వారిని ఎదిరించే సమయంలో ఆయనకు అండగా నిలబడిన ఇతర స్వాతంత్ర్య వీరుల పాత్రల్లో తమిళ నటుడు సేతుపతి, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించారు. ఈ సినిమాలో చిరంజీవి భార్యగా నయనతార నటించగా.. నర్తకి లక్ష్మిగా ఓ చిన్న పాత్రలో తమన్నా నటించారు.

ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో పాత్ర అనుష్కది. ఆమె ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయిగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్, చిరంజీవి ముంబైలో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పారు. 1857లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా విప్లవం లేవదీసిన ఝాన్సీ లక్ష్మీబాయి.. ఆమె కంటే ముందే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి .

అందుకే ఈ సినిమా ప్రారంభం అనుష్క చెబుతున్నట్టుగా సాగుతుంది. నరసింహారెడ్డి పాత్ర గురించి అనుష్క వివరిస్తుండగా సినిమా కథలోకి వెళ్తుంది. ఇక పైనల్ ట్విస్ట్ పవన్ కల్యాణ్ ఇస్తారు. ఈ సినిమాలో నరసింహారెడ్డిని ఉరి తీసిన తరవాత మరో 10 నిమిషాల పాటు స్టోరీ ఉంటుంది. దాన్ని పవన్ కల్యాణ్ వాయిస్ తో నడిపించారు. ఇక ఈ సినిమాలో ఒక్క వార్ సీక్వెన్స్ కోసమే రూ.75 కోట్ల ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో బ్రిటిష్ అధికారుల పాత్రలు మరో ప్రత్యేకత. వీటికోసం ఇండియన్స్ ను కాకుండా నేటివిటీ కోసం ఇంగ్లిష్ నటులనే తీసుకున్నారు. మొత్తం 100 మందికి ఆడిషన్స్ నిర్వహించి ఏడుగురిని తీసుకున్నారు. ఈ సినిమాలోని జాతర పాట కోసం ఏకంగా 4500 మంది డ్యాన్సర్లను ఉపయోగించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news