చెరుకురసంతో వెయిట్‌లాస్‌!

-

ఇంట్లో ఉండే మహిళలు, ఉద్యోగం చేసే మహిళలు ఇలా ఎవరైనా పనిచేస్తున్నప్పటికీ అధికంగా బరువు పెరుగుతున్నారా? వ్యాయామం చేస్తున్నప్పటికీ శరీరంలో మార్పులు రావడంలేదా? శరీర బరువు ఎక్కువవ్వడంతో ఏ పనిచేయలేకపోతున్న వారికి చెరుకురసం చక్కని పరిష్కారం. దీంతో మరెన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యులు.

– చెరుకురసం బరువును తగ్గిస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. ఇందులోని ఫ్లెవనాయిడ్స్‌, పాలీఫెనోలిక్‌ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ జ్వరం, జలుబు, తుమ్ములు వచ్చే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
– రోజూ ఒక గ్లాస్‌ చెరుకురసం తాగితే ఫైబర్‌తో పాటు ప్రొటీన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్‌, జింక్‌, అమైనోయాసిడ్లు శరీరానికి అందుతాయి. ఇవి అధిక బరువును తగ్గిస్తాయి. క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని కూడా ఈ డ్రింక్‌ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
– 220 గ్రాముల చెరుకురసంలో 180 కేలరీల శక్తి ఉంటుంది. చక్కెర 30 గ్రాములు మాత్రమే ఉంటుంది. మన శరీరంలో పేరుకుపోయే ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసెరైడ్స్‌ను కరిగిస్తుంది. వీటి వల్లే బరువు పెరుగుతూ ఉంటారు. ఇవి గుండె సంబంధిత జబ్బులకు కూడా కారణమవుతాయి. చెరుకురసంతో వీటన్నింటినీ ఎదుర్కోవచ్చు.
– చెరుకులోని పీచు పదార్థం కొవ్వును కరిగిస్తుంది. ఇది పొట్ట చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్‌ను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. రోజూ గ్లాస్‌ చెరుకురసం తాగితే మన శరీరాన్ని ఆటోమేటిగ్గా క్లీన్‌ చేస్తుంది. అనవసరవ్యర్థాలను బయటకు పంపుతుంది. ఇలా రెగ్యూలర్‌గా జరిగే ప్రక్రియతోనే బరువు తగ్గుతారు.
– చెరుకురసం వల్ల ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. రోజుకో గ్లాస్‌ చెరుకురసం తాగడం వల్ల కిడ్నీలు, లివర్‌ బాగా పనిచేస్తాయి. చాలా రోగాలు నయమవుతాయి. క్యాన్సర్‌, కామెర్లు వంటివి కూడా తగ్గుతాయి. చెరుకురసంలోని పొటాషియం జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news