” ప్రేమ”ను ప్రేమించండి

-

” ప్రేమ” సృష్టి కి మూలమైనది. అవును ” ప్రేమే” మూలం. సృష్టికి కారణం ” ప్రేమ”. మనకు కనిపించని ఆ భగవంతుడి ప్రేమ కారణంగానే సృష్టి ఏర్పడింది. ఆ ప్రేమతోనే సృష్టి రచన చేశాడు ఆయన. అమ్మను సృష్టించాడు, నాన్నను ఇచ్చాడు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, స్నేహితులు, ఇలా అన్ని బంధాలను మనకు అందించాడు భగవంతుడు. ఇలా ప్రతి బంధంలోనూ ప్రేమ ఇచ్చాడు.

బిడ్డ కడుపున పడ్డ క్షణం నుంచి ఆమె సృష్టిలో కలిసిపోయే వరకు అమ్మ “ప్రేమ” మనల్ని ముందుకు నడిపిస్తుంది. నాన్న ” ప్రేమ” భాధ్యత మనకు బాసటగా నిలుస్తుంది, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల ” ప్రేమ” బంధం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా మన చుట్టూ ఉన్న ప్రతీ బంధంలోనూ ఉన్నది ” ప్రేమే”. కానీ ఈ బందాల్లోని ప్రేమ ఎవ్వరికీ కనిపించదు. అమ్మ విసుగు, నాన్న కోపం, అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు లలో ఎక్కువ తక్కువలు ఇవే మనకు కనిపించేవి, వీటినే మనం వాళ్ళలో చూస్తున్నది. వీటన్నింటినీ పక్కన పెట్టీ యుక్త వయసులో మనకు ఏర్పడ్డ తొలి ఆకర్షణ ని ” ప్రేమ ” అంటున్నాం.

ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండేదే ప్రేమ అనుకుంటున్నాం. ప్రేమిస్తున్నాం ఆ ప్రేమలో మునిగిపోయి మనతో పాటు ముడిపడి ఉన్న మిగతా అన్ని బంధాలను మర్చిపోయెంతగా ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ కొంతమందిని ఉన్నత స్థాయిలో ఉంచితే, మరి కొందరిని బజారున పడేసింది. ఇంకొంత మంది ప్రేమలో ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకోడం తెలిసినదే. అయితే ఇలా జీవితం నాశనం చేసుకునే ముందు అందరు ప్రేమికులు ఒక్కసారి మీతో పాటు ముందు నుంచి ఉన్న అమ్మ, నాన్న, అక్క, అన్న, ఇలా మీకున్న అన్ని ప్రేమలను గురించి ఆలోచించండి. Feb14 వాలెంటైన్స్ డే. ప్రతీ సంవత్సరం వస్తుంది. కానీ జీవితం అలా కాదు. ఒక్కసారి చేయ్యిదాటిపోతే మళ్ళీ రాదు.

Read more RELATED
Recommended to you

Latest news