ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని చరణ్- తారక్ లుక్ రికీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన దర్శకధీరుడు ..!

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ గురించిన వార్త ఏదో ఒకటి సంచలనం సృష్ఠిస్తున్నాయి. అది గాసిప్ అయినా, లేక లీక్ వ్యవహారమైనా. ఇక చాలా రోజుల నుండి రాజమౌళి టీమ్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న తారక్,చరణ్ ల లుక్ లు రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో అటు చరణ్ ఫ్యాన్స్ ఇటు తారక్ ఫ్యాన్స్ డైరెక్ట్ గా జక్కన్ననే అడుగుతున్నారు కూడా. 2020 జనవరి 1 న ఈ సినిమా నుండి తారక్, చరణ్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అందరూ ఊహించారు. కాని జక్కన్న న్యూ ఇయర్ గిఫ్ట్ ఈ రేంజ్ లో షాకిస్తారనుకోలేదు. జనవరి 1 నుండి ఆర్.ఆర్.ఆర్ హంగా మొదలవుతుందని అందరిని చిత్ర యూనిట్ ఉబలాట పెట్టారు. ఆ రోజు మొదలైన హంగామా వరుసగా అకేషన్స్ లో ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందని చిత్ర యూనిట్ అన్నారు కూడా. కానీ సీన్ రివర్స్ అయి ఫ్యాన్స్ కి దిమ్మతిరిగింది.

 

దానికి తోడు ఊహించని ట్విస్టు కూడా ఇచ్చారు. ఇటీవలే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీని జూలై 30 నుంచి జనవరి 8కి వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఫస్ట్ లుక్ రిలీజ్ లు ఉంటాయా..! అన్న సందేహం కలగడంతో అందరు ఇక ఈ సినిమా అప్డేట్స్ గురించి ఎదురుచూడటం మానేశారు. అయితే కొమురం భీమ్ గా తారక్.. అల్లూరి సీతారామరాజుగా చరణ్ పూర్తి లుక్ లు ఎలా ఉండబోతున్నాయో త్వరలో తెలియనుందట. ఫిల్మ్ నగర్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం రాజమౌళి చరణ్, తారక్ లుక్ రిలీజ్ కోసం రెండు ఇంపార్టెంట్ తేదీల్ని లాక్ చేశారని తెలుస్తోంది.

 

చరణ్ బర్త్ డే మార్చి 27 అలాగే మే 20 తారక్ బర్త్ డే తేదీల సందర్భంలో అద్భుతమైన ముహూర్తం కుదిరిందిట. ముందుగా చరణ్ -సీతారామరాజు లుక్ ని ఆ తర్వాత తారక్ – కొమురం భీమ్ లుక్ ని రిలీజ్ చేస్తారని తాజాగా వార్త బయటకి వచ్చింది. దీంతో చరణ్, తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్, ఒలీవియా, అజయ్ దేవగన్ తదితరులు నటిస్తున్నారు.