పాపం పార్కులు వదిలేసిన ప్రేమికులు, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో చూడండి…!

ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పార్కులు, హోటల్స్, ఇలా పలు రకాల పర్యాటక ప్రాంతాల్లో ప్రేమికులు సందడి చేస్తున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం పరిస్తితి భిన్నంగా ఉంది. పార్కులన్నీ బోసిపోయి కన్పిస్తున్నాయి. ప్రేమికుల రోజు ప్రేమ జంటలు లేక పార్కులన్నీ కళతప్పాయి. అసలు ఈరోజూ ప్రేమికుల దినోత్సమేనా అన్న అనుమానం కలుగుతుంది.

ఈ పరిస్థితికి కారణం ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన హెచ్చరికలే. పార్కుల్లో ప్రేమజంటలు కన్పిస్తే.. అక్కడికక్కడే పెళ్లి చేయడంతో పాటు తల్లిదండ్రుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని వారు చేసిన ప్రకటన కారణంగా ప్రేమికులు పార్కుకు రావడం మానేశారు. మామూలు రోజుల్లో వచ్చే వారు సైతం కనపడటం లేదు. ఇంతకు ముందు పార్కులు అని ప్రేమ జంటలతో కళకళలాడేవి.

అయితే ఎవరి దారులు వారికి ఉంటాయి కదా ఇప్పుడు ప్రేమికులు తమ ప్రైవసీ ప్లేస్ ను కాస్త హోటల్స్, రెస్టారెంట్లకు మర్చారు. పార్కులకు వెళ్లి ఇబ్బంది పడే బదులు హోటళ్లు, రెస్టారెంట్లలో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో శుక్రవారం పలు హోటల్స్, రెస్టారెంట్లు నిండిపోయాయి. మరికొంతమంది ప్రేమికులు ఆన్‌లైన్‌ను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. వీడియో కాలింగ్, ఎస్ఎంఎస్‌లు, వాయిస్ చాటింగ్‌ లతో తమ భావాల్ని పంచుకుంటున్నారు.