Fact Check: వేడి నీటి స్నానం లేదా గోరు వెచ్చని నీటిని తాగితే కోవిడ్ ని అడ్డుకోవ‌చ్చా ?

-

సోష‌ల్ మీడియాలో కోవిడ్‌ను అడ్డుకోవ‌డంపై అనేక వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వాటిలో చాలా వార్త‌లు ఫేక్ వే ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రో ఫేక్ వార్త ప్ర‌చారంలో ఉంది. వేడి నీటితో స్నానం చేయ‌డం లేదా గోరు వెచ్చ‌ని నీటిని తాగ‌డం వ‌ల్ల క‌రోనా రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని ఒక మెసేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

వేడి నీటితో స్నానం చేయ‌డం లేదా వెచ్చని నీటిని తాగడం వ‌ల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చ‌ని వైర‌ల్ అవుతున్న మెసేజ్‌లో నిజం లేద‌ని, అది ఫేక్ అని ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు మైగ‌వ్ ఇండియా త‌న‌ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా దీనిపై స్పష్టతను ఇచ్చింది. వేడి నీటి స్నానం చేయ‌డం లేదా వెచ్చని నీటిని తాగ‌డం వ‌ల్ల కోవిడ్ రాద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, నిజానికి ఆ ఉష్ణోగ్ర‌త కోవిడ్‌ను చంప‌లేద‌ని, అందుకు ల్యాబ్ సెట్టింగ్‌లలో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని తెలిపింది.

ఇక క‌రోనా నుండి కోలుకునే వారికి 5 దశల నమూనా భోజన పథకాన్ని కూడా ప్రభుత్వం సూచించింది. ఈ ప్రణాళిక రోగనిరోధక శక్తిని పెంచుతుందని, వైరస్ నుంచి కోలుకున్నాక క‌లిగే అలసట నుండి బ‌య‌ట ప‌డేందుకు సహాయపడుతుందని పేర్కొంది. కాగా భారతదేశంలో శనివారం కోవిడ్ -19 తో మొదటి సారిగా 4,000 మందికి పైగా మరణించారు. ఇక ఒకే రోజులో 4.01 లక్షల కేసులు నమోదు అయ్యాయి. 37,23,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version