కరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొందరు కావాలని పనిగట్టుకుని మరీ సోషల్ మీడియాలో కరోనాపై రకరకాల వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా ఇంకో వార్త ప్రచారం అవుతోంది. అదేమిటంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్), బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లు కలిసి సంయుక్తంగా పలు కోవిడ్ వేరియెంట్లను విడుదల చేస్తున్నాయని, కోవిడ్ వేరియెంట్లను వ్యాప్తి చేయడంలో ఆ సంస్థల హస్తం కూడా ఉందని, వారు నిర్దిష్టమైన తేదీల్లో కోవిడ్ స్ట్రెయిన్లను విడుదల చేశారని, కావాలంటే ఓ పట్టికలో ఆ తేదీలను చూడవచ్చని.. ఓ వార్త వైరల్ అవుతోంది. అందులో పలు రకాల వేరియెంట్లు, వాటి పేర్లు, అవి విడుదల అయిన తేదీల వివరాలను ఇచ్చారు.
ఇక ఆ లిస్ట్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లకు చెందిన లోగోలు కూడా ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆ లిస్ట్ లో ఎంత మాత్రం నిజం లేదని, అదంతా అబద్దమని.. పలు మీడియా సంస్థల విచారణలో వెల్లడైంది. కొందరు కావాలనే ఆ లిస్ట్‌ను విడుదల చేశారని తేలింది.
These are the PLANNED COVID-19 VARIANTS – just look at the dates when they will be “released” to the media.
THESE KHAZARIAN JEWS ARE PSYCHOPATHS. pic.twitter.com/Ghep359vJO
— Teresa 2.0 (@Thorsome4) July 24, 2021
నిజానికి ఆ లిస్ట్‌లో ఇచ్చిన కొన్ని కోవిడ్ వేరియెంట్లు ఇప్పటికే వ్యాప్తి చెందాయి. కానీ అవి వ్యాప్తి చెందిన తేదీలు లిస్ట్‌లో ఉన్నవి ఎంత మాత్రం నిజం కాదు. వేరే తేదీల్లో ఆ వేరియెంట్లు వ్యాప్తి చెందాయి. ఇక లిస్ట్‌లో ఇచ్చిన చాలా వరకు వేరియెంట్ల గురించి ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించలేదు. అందువల్ల ఆ లిస్ట్ ఫేక్ అని స్పష్టమవుతుంది. కనుక దీన్ని నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు.