ఫ్యాక్ట్ చెక్ : సబ్సిడీ కింద ఇండియన్ ఆయిల్ నుండి రూ.6,000..!

-

ఎన్నో నకిలీ వార్తలు తరచు మనకి సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ వార్తలు ని నమ్మారంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఉద్యోగాలు పేరు తో స్కీములు పేరు తో ఎన్నో నకిలీ వార్తలు తరచూ సోషల్ మీడియాలో ఉంటుంటాయి.

ఇక సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త వచ్చింది. అది చూసి అంతా నిజమని భావిస్తున్నారు. దాని వలన అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫ్యూయల్ సబ్సిడీ బహుమతి అంటూ రూ.6000 పొందవచ్చని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది.

మరి ఆయిల్ కార్పొరేషన్ ద్వారా రూ.6000 రూపాయలను గెలుచుకోవచ్చా..? ఈ లక్కీ డ్రా లో నిజం ఎంత అనే విషయానికి వస్తే ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో ఎలాంటి నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. కనుక అనవసరంగా ఇటువంటి వార్తలని నమ్మద్దు.

Read more RELATED
Recommended to you

Latest news