ఫ్యాక్ట్ చెక్: అలోవెరా మొక్క ఆక్సిజెన్ ని ఇచ్చి తొమ్మిది ఎయిర్ ప్యూరిఫైర్స్ పనిని చెయ్యగలదు..!

తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అయింది. అయితే ఆ పోస్ట్ లో నిజమెంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందు ఆ పోస్ట్ లో ఏముంది అనేది చూస్తే… అలోవెరా మొక్క ( aloe vera ) ఇంట్లో పెంచడం వల్ల అది కార్బన్ డయాక్సయిడ్ తీసుకుని ఆక్సిజన్ ని ఇస్తాయని ఉంది. అదే విధంగా తొమ్మిది ప్యూరిఫైయర్స్ పని ఇది చేస్తుందని ఆ సోషల్ మీడియా పోస్ట్ లో ఉంది. ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

aloe vera
aloe vera | అలోవెరా మొక్క

అలోవెరా మొక్కల్లో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఎన్నో మందుల్లో దానిని ఉపయోగిస్తారు అలానే మొక్క కనుక ఆక్సిజన్ ఇస్తుంది అనడంలో తప్పులేదు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్ట్ ని చాలా మంది ఇప్పటికే షేర్ చేయడం జరిగింది. కేవలం రెండు వారాలలో 41 వేల షేర్లు చేశారు. ఒక్క అలోవెరా మొక్క 9 బయోలాజికల్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ పనిచేస్తుందని దానిలో ఉంది. అయితే కేవలం అలోవేరా మాత్రమే స్పెషల్ కాదు అన్ని మొక్కలు కూడా కార్బన్ డయాక్సయిడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి.

గాలిని స్వచ్ఛమైన గాలిలా మారుస్తాయి. అయితే అలోవెరా ఈ పని చేస్తుంది అనడంలో తప్పులేదు కానీ అలోవేరా లాగే అన్ని మొక్కలు కూడా ఆ పని చేస్తాయని ఇంటర్నేషనల్ ఆలో సైన్స్ కౌన్సిల్ చెప్పింది. ఫోటోసింతసెస్ ప్రాసెస్ లో మొక్కలు కార్బన్ డయాక్సయిడ్ తీసుకుని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి అలానే ఆక్సిజన్ ప్రొడక్షన్ అనేది మొక్కని, బట్టి అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి వెంటిలేషన్ బట్టి ఉంటుందని చెప్పారు. ఇటువంటి పోస్టులలో పోస్ట్ జస్టిఫికేషన్ లేదని… మిగిలిన మొక్కలు కూడా ఇదే రీతిలో ఉంటాయని చెప్పారు.