ఫ్యాక్ట్ చెక్: డిజిటల్ ఇండియా స్కీమ్ లో భాగంగా మొబైల్ టవర్ ని ఫిక్స్ చేసే ఉద్యోగాలు.. నిజమేనా..?

-

డిజిటల్ ఇండియా లో భాగంగా వైఫై టవర్ ని ఫిక్స్ చేసే ఉద్యోగాలని ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఒక అగ్రిమెంట్ లెటర్ వచ్చింది. అయితే కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా సోషల్ మీడియా లో ఏదో ఒక ఫేక్ వార్త మనకి కనబడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఫ్రాడ్స్టర్స్ జనాలని గవర్నమెంట్ స్కీమ్ లతో మోసం చేయాలని చూస్తున్నారు.

తాజాగా ఒక అగ్రిమెంట్ లెటర్ వచ్చింది. అందులో డిజిటల్ ఇండియా లో భాగంగా ప్రభుత్వం మొబైల్ టవర్ ని ఫిక్స్ చేయడానికి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు.. అభ్యర్థుల కి ఉద్యోగం తో పాటుగా ఉండడానికి వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు అందులో ఉంది. మొబైల్ టవర్ ని ఫిక్స్ చేయడానికి 25 వేల రూపాయల నుంచి 30 లక్షలు వరకూ ముందే ఇస్తున్నట్లు.. 20 ఏళ్ల పాటు అగ్రిమెంట్ ని కుదుర్చుకోచ్చు అని అందులో ఉంది.

అయితే ఈ లెటర్ లో నిజమెంత అనేది చూస్తే… ప్రభుత్వం ఇలాంటి లెటర్ ని ఏమి అప్రూవ్ చేయలేదని తెలుస్తోంది. కేవలం ఇది ఫేక్ వార్తని ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. అదే విధంగా ఉత్తరంలో 730 రూపాయిలు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలని కూడా ఉంది. అయితే ఇలాంటి ఫేక్ వార్తలు ఎవరు నమ్మి మోసపోవద్దు. అనవసరంగా రిజిస్ట్రేషన్ ఫీజు వంటివి చెల్లించి ఎవరు మోసపోకండి. ఇలాంటి ఫేక్ వార్తలు తో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయని గ్రహించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version