ఫ్యాక్ట్ చెక్: ప్రధాని మోదీతో సమావేశమైన ఉపాసన.. నిజమెంత..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్స్ లో చైర్ పర్సన్ గా బిజీగా ఉంటూనే మరొక పక్క ఆమె వివిధ రకాల సేవలను ఇస్తూ ఉంటారు. ఆమెకంటూ గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఉపాసనా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. దుబాయ్ 2020 ఎక్స్‌పోను ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ తో భేటీ అయిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అలా దుబాయ్ 2020 ఎక్స్‌పోను చూడడం ఆమెకి ఎంతో గౌరవప్రదంగా ఉంది అని అన్నారు. అయితే నిజంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉపాసన కలిసారా..? ఇందులో నిజం ఎంత..? ఈ విషయం లోకి వస్తే… ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో దీనికి సంబంధించి విషయాలని పంచుకున్నారు.

మీ మీ పిల్లల్ని అక్కడికి తీసుకు వెళ్ళండి అంటూ పోస్ట్ చేశారు. అలాగే కరోనా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని అన్నారు. అయితే ఇందులో వాస్తవం ఏ మాత్రం ఉంది అనేది చూస్తే… ఆమె అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా ప్రధాని మోడీ పక్కన కూర్చున్నట్లు ఫోటో దిగారు. దీనిని స్వయంగా ఉపాసన ఏ చెప్పారు. అయితే కొంతమంది దీనిని పొరపాటుగా అర్థం చేసుకుని నిజంగా మోదీని కలిసినట్లు రాశారు.

అగ్‌మెంటెడ్ రియాలిటీ అనేది సాంకేతికత. మనిషి చూసే వాస్తవ దృశ్యాన్ని పూర్తిగా కంప్యూటర్ ద్వారా కల్పితంగా చూపుతుంది. అంటే ఏమిటంటే మన చుట్టూ చేసే వాస్తవ దృశ్యాలలో కల్పిత వస్తువులను కంప్యూటర్ సహాయంతో చూపించే పక్రియ. ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ దుబాయ్ 2020 ఎక్స్‌పోను భారత పార్లమెంట్ ప్రధాన మోడీ ఉన్నట్లు ఆవిష్కరించారు. అంతే కానీ నిజానికి ఆమె మోదీని రియల్ గా కలవలేదు.