ప‌తంజ‌లికి చెందిన క‌రోనిల్ ట్యాబ్లెట్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ల‌భించిందా ? నిజ‌మెంత ?

Join Our Community
follow manalokam on social media

క‌రోనా నేప‌థ్యంలో గ‌తేడాది ప‌తంజ‌లి గ్రూప్ క‌రోనిల్ పేరిట ఓ ట్యాబ్లెట్‌ను రూపొందించి మార్కెట్‌లోకి విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌రైన ప‌రిశోధ‌న చేయ‌కుండా మార్కెట్‌లోకి అలా ఎలా విడుద‌ల చేస్తారు ? అని చెప్పి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్ర‌శ్నించ‌గా.. ప‌తంజ‌లి సంస్థ క‌రోనిల్ ను వెన‌క్కి తీసుకుంది. త‌రువాత ఆ ట్యాబ్లెట్ల‌ను రోగ నిరోధ‌క శ‌క్తి పెంచే ట్యాబ్లెట్లుగా ప‌తంజ‌లి మార్చి వాటిని విక్రయించింది.

who does not approved coronil tablet

అయితే ఇటీవ‌లే ఆయుష్ మంత్రిత్వ శాఖ మళ్లీ ఆ ట్యాబ్లెట్ కోవిడ్‌కు ప‌నిచేస్తుంద‌ని, కోవిడ్ ల‌క్ష‌ణాల‌ను త‌గ్గిస్తుంద‌ని ధ్రువీక‌రించింది. దీంతో క‌రోనిల్‌ను మ‌ళ్లీ మార్కెట్‌లోకి ప‌తంజ‌లి సంస్థ రీ లాంచ్ చేసింది. అయితే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ క‌రోనిల్ ట్యాబ్లెట్‌ను కోవిడ్ చికిత్స‌కు అనుమ‌తించింద‌ని చెబుతూ మీడియాలో కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అదేమి లేద‌ని, వ‌ట్టి పుకారేన‌ని అటు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థతోపాటు ఇటు ప‌తంజ‌లి కూడా ఆ వార్త‌ల‌ను కొట్టి పారేశాయి.

క‌రోనిల్ ట్యాబ్లెట్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ధ్రువీక‌ర‌ణ ల‌భించింద‌ని చెబుతూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఆ సంస్థ స్పందించింది. తాము క‌రోనిల్ ట్యాబ్లెట్ కు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని, అస‌లు ఆ ట్యాబ్లెట్ ప‌నితీరును కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిశీలించ‌లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేసింది. అలాగే ప‌తంజ‌లి గ్రూప్ ఎండీ ఆచార్య బాల‌కృష్ణ స్పందిస్తూ.. క‌రోనిల్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ల‌భించింద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు. త‌మ ట్యాబ్లెట్ ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ధ్రువీక‌రించ‌లేద‌ని, అలాగే దాన్ని తిర‌స్క‌రించ‌లేద‌ని.. ఆయ‌న ట్వీట్ చేశారు.

TOP STORIES

భక్తి: మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి..?

మాఘ పౌర్ణమి చాల ప్రత్యేకమైన రోజు. ఆరోజు హిందువులు ప్రత్యేక పూజలు చేయడం, నదీ స్నానాలని చేయడం చేస్తారు. అలానే ధానం చేయడం మొదలైన వాటిని...