క్రేజీ కమ్ సిల్లీ ముచ్చట్లు.. మస్కారా వేసుకుంటూ నోరు ఎందుకు తెరుస్తున్నారు అమ్మాయిలూ..? 

-

కొన్ని విషయాలు మన రోజువారి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ మనకు తెలియదు. అవి కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. డైలీ కోల్గేట్ పేస్ట్ తో బ్రష్ చేసుకుంటాం.. ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ పేరు ఎందుకు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కీవార్డ్స్ గా #biryani #naturephotography అంటూ మనం పెట్టినపోస్టుకు యాస్టాగ్ లు ఇస్తాం. అసలు ఈ పేరుకు అర్థం ఏంటో తెలుసా..? ఇలాంటి కొన్ని క్రేజీ కమ్ సిల్లీ ముచ్చట్లు మీకోసం.. చదివేయండి.!
ఐదువేళ్లూ ఒకేలా ఉండనట్టే… వాటిపైన గోరు ఎదిగే క్రమమూ ఒకలా ఉండదండి.. మధ్య వేలి గోరు వేగంగా పెరిగితే… బొటనవేలిది మెల్లగా ఎదుగుతుంది. మిగతావాటి గోళ్లు… ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటాయి.
ఎస్కిమోలు పెదాలతో ముద్దుపెట్టుకోరు. వాళ్లే కాదు… ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పపువా న్యూగినియాల్లోని ఆదిమజాతులు కూడా చుంబనానికి దూరమే!
మనం ఫిల్ము, మూవీ, బొమ్మ, ఆట… సినిమాని ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా. అమెరికాలోని సామాన్య జనం ‘నేబ్‌’ అనే పిలుస్తారు. అంటే ‘నైబర్‌హుడ్‌ థియేటర్స్‌’ అన్న మాటకి అది షాట్ కట్.
హ్యాష్‌ట్యాగ్‌ అని ఇట్టే అంటున్నాం కానీ దాని అసలు పేరు అక్టోతోర్పే. అక్టో అంటే ఎనిమిది. దీనికి ఎనిమిది అంచులుంటాయి కాబట్టి ఆ పేరొచ్చిందట. భలే ఉంది కదా..
19వ శతాబ్దంలో కాగితాలని పత్తితోనే తయారుచేసేవారు. పుస్తకాలూ అంతే. ఆ తర్వాత వచ్చిన పుస్తకాలకన్నా ఇవే ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటున్నాయట.
పదిలో తొమ్మిది మంది అమ్మాయిలు మస్కారా వేసుకునేటప్పుడు నోరు తెరుస్తారు. కంటి రెప్పకూ నోటికీ సంబంధించిన నరాలు చాలా దగ్గరగా ఉండటం వల్ల… రెప్ప పైన ఇలా వస్తువేదో పెట్టగానే అలా నోరు అసంకల్పితంగా తెరుచుకుంటుందట. ఏంటి అమ్మాయిలు మీరు చేసే ఉంటారుగా.. ఈసారి గమనించండి.
అదో బొగ్గు(కోల్‌) గిడ్డంగి. అక్కడికి వెళ్లాలంటే ఓ గ్రామాన్ని దాటుకుని వెళ్లాలి… కాబట్టి ఆ గ్రామానికి కోల్‌గేట్‌ అని పేరు. ఇంగ్లండులో ఉన్న ఆ ఊరి నుంచి వచ్చిన విలియమ్‌ స్థాపించిన సంస్థే కోల్‌గేట్‌. అలా ఈ టూత్‌పేస్ట్‌ కంపెనీ పేరు వెనక ఓ ఊరుందన్నమాట!
పావురం ఎముకలు దాని ఈకలకంటే తక్కువ బరువు ఉంటాయి.
అండమాన్‌ రాష్ట్ర జంతువు… ‘నీటి ఆవు’ అని ముద్దుగా పిలిచే ‘డుగాంగ్‌’. మనదేశంలో మరే సముద్ర జీవికీ ఇలా రాష్ట్రజంతువు హోదా లేదు.
అమెరికాలో కోడిగుడ్లని శుభ్రంగా కడిగి శానిటైజ్‌ చేశాకే అమ్ముతారు. అదే యూకేలో అలా కడిగి అమ్మడాన్ని అసహజంగా భావిస్తారు. ఈ కారణంవల్ల అమెరికా గుడ్లని యూకే లోనూ… యూకే గుడ్లని అమెరికాలోనూ నిషేధించారట.
వృక్షశాస్త్రపరంగా…వెదురు మొక్క కూరగాయల (వెజిటబుల్‌) కోవలోకే వస్తుంది.
పక్షి జాతుల్లో వాసన గుర్తించగలిగేవి ఒక్క కివీలే.
నెదర్లాండ్స్‌ ప్రపంచ ‘డీజే’ల రాజధాని. ప్రపంచంలోని టాప్‌-10 డీజేల్లో ఏడుగురు అక్కడివారే ఉంటారు. ఆ నైపుణ్యాలు నేర్పించేందుకు ప్రత్యేకంగా కాలేజీలూ ఉన్నాయి.
పిల్లలు కొందరు బొటనవేలు చీకినట్లే… గున్న ఏనుగులకి తమ తొండాన్ని నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటుందట.
ఆఫ్రికా దేశం మొజాంబిక్‌ జాతీయ పతాకంలో ‘ఏకే 47’ ఆయుధం కూడా ఉంటుంది! ఆ దేశం స్వాతంత్య్రం సాధించడానికి అది ఎంతో ఉపయోగపడటం వల్ల జెండాలో దాన్నీ పెట్టారట.
అమెరికాలో సొర చేపల దాడికన్నా… ఆవులు కుమ్మడంతో చనిపోయేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.. ఏటా సొరచేప దాడివల్ల చనిపోయేవాళ్లు ఐదుగురుంటే… గోవు ధాటికి 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
భార్యో, భర్తో, పిల్లలో, ప్రియమైన కుక్కో… ఏదైనా సరే..మీరు ప్రేమించేవాళ్ల పక్కన పడుకుంటే తొందరగా నిద్రొస్తుందట. నిద్రరాకుండా ఓసారి ఈ ట్రిక్ ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version