మీ పిల్లల్లో IQ స్థాయిని పెంచడానికి ఈ పనులు చేసేయండి చాలు..!

పేరెంట్స్ వాళ్ల పిల్లలను తెలివిగల వారిలా చేయాలని తెగ తాపత్రయపడుతుంటారు. పక్కవారి పిల్లలతో ఊకే మన పిల్లలను పోల్చుకుంటూనే ఉంటారు. వాళ్ల పిల్లలు అంత యాక్టీవ్ గా తెలివిగా ఉంటున్నారు.. వీడేంటో ఎప్పుడూ డల్ గా ఉంటాడు అని బాధపడతారు కూడా.. మీ పిల్లల్లో IQ పెంచేందుకు పేరెంట్స్ గా మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. పిల్లలు తెలివిగా ఉండడానికి ,పిల్లలలో IQ స్థాయిని పెంచడానికి మధ్య వ్యత్యాసం ఉంది. IQ అంటే తెలివైన గుణకం. ఇది పిల్లలను ఇతర పిల్లల నుంచి భిన్నంగా చేస్తుంది. ఈరోజు మనం పిల్లల్లో IQ స్థాయిని ఎలా పెంచవచ్చో చూద్దాం.
పిల్లలు మ్యూజిక్ నేర్చుకోవడం మెదడు అభివృద్ధికి చాలా మంచి కసరత్తు లాంటింది. దీనివల్ల పిల్లల IQ స్థాయిని పెంచడమే కాకుండా, గణిత నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేస్తుంది. వాయిద్యం వాయించే పిల్లల IQ స్థాయి బాగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు… మీరు మీ పిల్లలకు గిటార్, కీబోర్డ్, సితార్, హార్మోనియం లేదా మరేదైనా వాయిద్యం వాయించడం నేర్పించండి. చదువుకునే రోజుల నుంచే పిల్లలకు ఇతర యాక్టివిటీస్ కూడా నేర్పించాలి. చదువు ఒక్కటే అంటే.. మీ పిల్లలు డమ్ గానే తయారవుతారు.
పిల్లలకు ఆడటం నేర్పించడం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే పిల్లల శారీరక ,మానసిక అభివృద్ధి ఆడటం ద్వారానే జరుగుతుంది. పిల్లలు ఆట ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటారు. మీరు వారితో కూడా ఆడవచ్చు, తద్వారా వారి ఉత్సాహం అలాగే ఉంటుంది. చదువుకు ఎంత సమయం కేటాయిస్తే.. అందులో సగమైన ఆటలకు కేటాయించాలి.
మీ పిల్లలతో ప్రతిరోజూ 10 -15 నిమిషాల పాటు గణితాన్ని కూడిక ,తీసివేత వంటి ప్రశ్నలను అడగవచ్చు. మీరు ప్రతిరోజూ పిల్లలను టేబుల్ అడగండి..ఆటలు ఆడటం ద్వారా పిల్లలకు కూడా గుణించడం నేర్పించవచ్చు. దీని కారణంగా పిల్లలలో ఐక్యూ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. మీరు పిల్లలకు అబాకస్ నేర్పడం ద్వారా IQ స్థాయిని కూడా పెంచుకోవచ్చట. మైండ్ గేమ్స్ వల్ల పిల్లల్లో IQ స్థాయిని పెంచవచ్చు. చెస్ ఆడటం ద్వారా వారి మానసిక వికాసాన్ని ,IQ స్థాయిని కూడా పెంచవచ్చు.
డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల పిల్లలలో స్వచ్ఛమైన ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. ఇది కాకుండా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. అందువల్ల, మీరు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 10 -15 నిమిషాల పాటు పిల్లలతో డీప్ బ్రీత్ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయించండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.