బరువు తగ్గేందుకు పెరుగుతో ఇవి కలిపి తింటే.. సూపర్ రిజల్ట్..!

-

ఏ కాలంలో అయినా డైలీ పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఎండాకాలంలో అయితే.. కచ్చితంగా తినాలి. పెరుగులో ప్రోబయోటిక్స్‌ అనే బాక్టీరియా ఉంటుంది. చెడు బాక్టీరియాను తొలగించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఇక అవిసెగింజెల్లో కూడా మంచి పోషకవిలువలు ఉన్నాయి. ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో మెండుగా ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్ తో బరువును ఈజీగా తగ్గించేయొచ్చట. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా ఉపయోగించాలో చూసేద్దామా..!
100 గ్రాముల అవిసె గింజల్లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కణాలను సరిచేయడానికి, కండరాలను నిర్మించడంలో సహాయపడే ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్. ఇది మ్యుసిలేజ్ అని పిలువబడే ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆకలిని అణచివేయడంలో సహాయపడుతుంది. దీంతో అతిగా తినకుండా సహాయపడుతుంది. ఇక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉండటంతో.. మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. దీనితో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది మీకు చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్, లిగ్నాన్ కారణంగా ఇది సాధ్యమవుతుంది. అవిసె గింజలు ఫైబర్‌కు మంచి మూలం. మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు, ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి చెందుతారు. బరువు తగ్గడానికి కేలరీలను తగ్గిస్తున్నట్లయితే, ఇది తినాలనే మీ కోరికను అణచివేయడంలో సహాయపడుతుంది.
అవిసె గింజలు రెండు రకాలు. పసుపు, గోధుమ రంగులో ఉంటాయి. ఈ రెండూ పోషకరమైనవే. 2 టీస్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. అవిసె గింజలను వేయించిన తర్వాత కూడా తినవచ్చు. అలాగే పానీయాలలో, సలాడ్లలో లేదా పెరుగులో కలుపుకుని తినవచ్చు. వేయించిన విత్తనాలను మెత్తగా పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి. సలాడ్ లేదా స్మూతీలో ఒక చెంచా పొడిని వేసి తినాలి.

అవిసె గింజలను పెరుగుతో కలిపి తింటే..

ముందుగా ఒక బాణలిలో రెండు చెంచాల అవిసె గింజలను వేయించి పొడి చేసుకోవాలి. దీని తరువాత, ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్లు తక్కువ కొవ్వు ఉన్న పెరుగు తీసుకుని, అవిసె గింజల పొడిని వేసి కలిపి తినేయడమే. మజ్జిగలో కూడా ఈ పొడి వేసుకుని తాగేయొచ్చు.
పెరుగులో అవిసె గింజల పొడి వేసి.. దానిపై.. 4-5 స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలను కట్ చేసి.. లంచ్ అయ్యాక తింటే కడుపు చల్లగా ఉంటుంది. భోజనం తక్కువ చేయొచ్చు.
అవిసె గింజలను డైలీ మీ డైట్ లో ఏదో ఒకరకంగా వాడుకుంటే.. ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.. బరువు కూడా ఈజీగా తగ్గేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news