ఏసీ ని కొనాలనుకుంటున్నారా..? ఈ టిప్స్ ని ఫాలో అయితే బెస్ట్…!

-

వేసవిలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. పైగా మరొక పక్క నుంచి వేడి గాలులు కూడా వీస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో చల్లగా ఉండే చోట కూర్చోవడం, చల్లటి నీళ్లు తాగడం లాంటివి చేస్తే రిలీఫ్ గా ఉంటుంది. ఎండాకాలంలో ఎండలు తట్టుకోలేక చాలా మంది ఏసీని కొనుగోలు చేస్తూ ఉంటారు.

మీరు కూడా ఏసి ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఎలాంటి ఏసీ బెస్ట్ అనేది మీకు అర్థం కావడం లేదా ..? అయితే మరి దాని కోసమే ఇప్పుడు చూద్దాం. ఏసీ కొనేవాళ్ళు ఈ టిప్స్ ని ఫాలో అయితే మంచిదే సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది.

ఏసీ లలో స్ప్లిట్ ఏసీ, విండో ఏసి అనేవి రెండు రకాలు అన్న సంగతి అందరికీ తెలుసు. అయితే విండో ఏసి ఇన్స్టాల్ చేయడం చాలా సులభం. సర్వీసింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు కిటికీ దగ్గర ఫిక్స్ చేయడానికి విండో ఏసి ఉపయోగపడుతుంది. స్ప్లిట్ ఏసీ అయితే ధర ఎక్కువ ఉంటుంది ఇందులో ఇంటర్నల్ యూనిట్, ఎక్స్టర్నల్ యూనిట్ ఉంటాయి. విండో ఏసీ కంటే కూడా స్ప్లిట్ ఏసి ఇన్స్టాల్ చేయడం కష్టంగా ఉంటుంది. మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే విండో ఏసి ని తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇన్స్టాలేషన్ వలన సమస్య ఉండదు. స్ప్లిట్ ఏసి తీసుకుంటే ఇల్లు మారినప్పుడల్లా ఇబ్బంది పడాలి.
అలానే మీరు ఏసిని ఎంచుకునేటప్పుడు మీ గది సైజును బట్టి ఎంచుకోండి. ఏసీలు వన్ టన్ 1.5, 2 టన్ కెపాసిటీతో ఉంటాయి. గది సైజు పెద్దగా ఉంటే ఎక్కువ కెపాసిటీ కావాలి అదే చిన్నగా ఉంటే తక్కువ కెపాసిటీ సరిపోతుంది. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని మీరు ఎందుకు తీసుకుంటే మంచిది.
అలానే బయట వాతావరణాన్ని బట్టి మనం ఏసీలో ఫీచర్స్ ఎడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఏసిని బాగా వాడితే బిల్లు ఎక్కువగా వస్తుంది కాబట్టి స్టార్ రేటింగ్ తప్పక చూసుకోండి. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసి ని ఎంచుకోవాలి.
ఏసీలో ఇన్వర్టర్ ఏసీలు కూడా ఉంటాయి ఇన్వర్టర్ వాడుతున్నట్లయితే ఇన్వెర్టర్ ఏసి తీసుకోవచ్చు అప్పుడు కరెంటు పోయినా సరే ఏసీ పనిచేస్తుంది ఇలా వీటినన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకుని ఏసిని ఎంపిక చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news